‘పాత మీనా’ ఫోన్‌తోనే అఆ సమస్య

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అఆ విడుదల తర్వాత అచ్చంగా యుద్ధనపూడి మీనాలా వుందని అందరూ గుర్తించడం..ఆఖరుకు ఆయన కూడా వేదికపై అంగీకరించడం తెలిసిందే కదా.. ఇంతకూ మూలం ఎవరంటే గతంలో మీనా తీసిన దర్శకనటి విజయనిర్మలేనట. ఆమె సినిమా చూడగానే కోపంగా సులోచనా రాణికి ఫోన్‌చేసి వుండకపోతే తీగ కదిలేది కాదు. విషయమేమంటే త్రివిక్రమ్‌ తల్లిగారు సులోచనా రాణి వీరాభిమాని. రెండు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి. ఈయన ఆమెను ఆంటీ అని పిలుస్తారట.ఆ నవలలు కథలు చడువుతూనే పెరిగాడు. బాగానే వుంది. కాని ఏ దశలోనూ మీ కథనే తీస్తున్నాను అని చెప్పలేదట. విజయ నిర్మల ఫోన్‌, తర్వాత సోషల్‌ మీడియాలో వ్యాఖ్యల తర్వాత అనివార్యంగా అంగీకరిస్తూనే ఏదో సాంకేతిక సాకులు చెప్పారు. ఇప్పుడు దాన్ని సవరించి మూల కథ ఆమెదని వేస్తున్నామని చెప్పారు. కాని కథ మాటలు తనవేనని ఒకసారి వేసుకున్నాక వెనక్కు వెళ్లలేరు కదా.. ఇప్పటికి ఆయన చెప్పిన సవరణ జరగనే లేదు. ఇవన్నీ చెప్పిన సినీ ప్రముఖుడు అన్నదేమంటే దీనిపై అసలు మాట్లాడాల్సిన ప్రసిద్ధ రచయిత్రి మౌనంగా వుంటే మనకెందుకు? అని. మరి ఆమెతో ఎలాటి అవగాహనకు వచ్చారో తెలియదు గాని ఇప్పటివరకూ మాట్లాడలేదు. ఇక మాట్లాడరు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com