బ‌న్నీ – త్రివిక్ర‌మ్‌.. స‌మ‌స్యేంటి??

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి… ప్రేక్ష‌కుల‌కు వినోదాలు పంచాయి. ఆర్థిక ప‌రంగా జులాయి లాభాలు తెచ్చుకున్నా, సన్నాఫ్ స‌త్య‌మూర్తి బొటాబొటీగా గ‌ట్టెక్కింది. అయినా స‌రే.. మూడో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దానికి తోడు `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ` హిట్టుతో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తున్నాడు.

ఈ సినిమా ఈపాటికే ప‌ట్టాలెక్కాల్సింది. కానీ… ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. త్రివిక్ర‌మ్ క‌థ‌ని సిద్ధం చేయ‌డానికి స‌మ‌యం తీసుకుంటున్నాడ‌ని, అందుకే ఈ సినిమా ఆల‌స్యం అవుతోంద‌ని చెప్పుకుంటున్నారు. కానీ… త్రివిక్ర‌మ్ వ‌ర్గీల వెర్ష‌న్ మ‌రోలా ఉంది. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే బ‌న్నీకి పూర్తి స్థాయి క‌థ వినిపించాడ‌ట‌. అయితే.. బ‌న్నీ క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చెప్పాడ‌ట‌. ఆ మార్పుల విష‌యంలోనే బ‌న్నీ – త్రివిక్ర‌మ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని టాక్‌. సాధార‌ణం ర‌చ‌యితే ద‌ర్శ‌కుడైతే… తాను రాసుకున్న స‌న్నివేశాల‌పై, క‌థ‌పై విప‌రీత‌మైన ప్రేమ ఉంటుంది. ఒక్క‌సారి పెన్ను పెట్టిన త‌ర‌వాత‌.. ఎవ‌రేం చెప్పినా విన‌బుద్ధి కాదు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో స‌మ‌స్య కూడా అదే. బ‌న్నీకి ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ రిజ‌ల్ట్‌తో భ‌యాలు ఎక్కువ‌య్యాయి. ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌డం లేదు. అందుకే.. త్రివిక్ర‌మ్ క‌థ‌లోనూ త‌ప్పుల్ని వెదుకుతున్నాడ‌ని తెలుస్తోంది. అందుకే.. ఈ సినిమా స్క్రిప్టు ద‌గ్గ‌రే మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌ని, ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చేంత వ‌ర‌కూ త‌దుప‌రి అడుగు ప‌డే ప్ర‌సక్తే లేద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖరీదైన స్థలం కొని ఘోరంగా మోసపోయిన జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే...

ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈసీ సంచలన నిర్ణయం

ఏపీలో పరిస్థితులు నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. పల్నాడు, అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో...

బలిచ్చింది జవహర్ రెడ్డే – ఆయన తప్పించుకోగలరా ?

ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాత్మక ఘటనలకు కారణం చూపి కొంతమంది పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇలా పలువురిపై వేటు వేసేలా... తప్పంతా వాళ్లపై తోసేసి నివేదికలు ఇచ్చింది సీఎస్...

ఐ ప్యాక్ కే పాఠాలు బోధిస్తున్న జగన్ రెడ్డి -విషయం ఏంటంటే..?

2019 నుంచి వైసీపీకి రాజకీయంగా సేవలందిస్తోన్న ఐ ప్యాక్ టీమ్ కు జగన్ రెడ్డి పాఠాలు బోధించడం రాజకీయ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.కొన్నేళ్లుగా ఐ ప్యాక్ డైరక్షన్ లో సాగుతున్న జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close