పూరి, చార్మిలకూ ఈడీ ఇక్కట్లు – లైగర్ డబ్బులెక్కడివి ?

లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ అధికారులు చార్మి, పూరి జగన్నాథ్‌లను తమ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి ఖాతాల్లోకి విధేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు జమ అయినట్లుగా గుర్తించారు. డబ్బులు ఎవరు జమ చేశారు..? ఎందుకు జమ చేశారు ? అనే అంశాలపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. వారిని ప్రశ్నించడానికి ముందే లైగర్ అకౌంట్స్ మొత్తాన్ని ఈడీ చెక్ చేసి.. రెడీగా ఉన్నట్లుగా చెబుతోంది.

లైగర్‌కు పెద్ద ఎత్తున ఖర్చుపెట్టారు. అదంతా పూరి జగన్నాథ్, చార్మీలే పెట్టుకున్నారు. సినిమా ఫ్లాప్ అవడంతో ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లతోనూ వివాదం ఏర్పడింది. అయితే ఈ సినిమాకు తెరవనుక పెట్టుబడిదారులున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. కొద్ది రోజుల కిందట..లైగర్ కు అసలైన పెట్టుబడి పెట్టింది కల్వకుంట్ల కవితేనని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ … దీనిపై దర్యాప్తు చేపట్టాలని … ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కవిత టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ తో ఓ మీటింగ్ పెట్టి విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఆదేశాలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు.

అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత పాత్రపై ఆరోపణలు వచ్చిన తరుణంలోనే.. ఇప్పుడు లైగర్ పెట్టుబడుల అంశాన్ని ఈడీ వెలికి తీయడం ఆసక్తికరంగా మారింది. లైగర్ వ్యవహారంలో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే… మొత్తంగా పూరి , చార్మీలు కూడా ఇరుక్కుపోతారు. విజయ్ దేవరకొండకు.. టీఆర్ఎస్ అధినేత కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కోణంలో ఏం జరుగుతుందో కానీ.. చార్మీ, పూరీ ఈడీ విచారణ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close