స‌ల్మాన్‌ఖాన్‌తో రాజ‌మౌళి సినిమా?

బాహుబ‌లితో… రాజ‌మౌళి బాలీవుడ్ మ‌న‌సుల్ని కూడా గెలుచుకొన్నాడు. రాజ‌మౌళి క‌థ చెప్పాలే గానీ.. విన‌డానికి అక్క‌డి అగ్ర క‌థానాయ‌కులంతా రెడీనే. అమీర్‌ఖాన్ సైతం రాజ‌మౌళితో ప‌నిచేయ‌డానికి ఉత్సాహంగా ఉన్నాడు. అయితే రాజ‌మౌళి దృష్టి మాత్రం స‌ల్మాన్‌ఖాన్ పై ప‌డింద‌ని తెలుస్తోంది. బాహుబ‌లి త‌ర‌వాత‌… రాజ‌మౌళి స‌ల్మాన్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. అది ఈగ‌కి సీక్వెల్ కావొచ్చ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌కి క‌థ అందించారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. అప్ప‌టి నుంచీ స‌ల్మాన్‌కీ, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కీ మంచి రాపో కుదిరింది. ఇప్పుడు ఈగ 2 క‌థ‌కీ స‌ల్మాన్‌కి వినిపించార‌ట విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఈ క‌థ విన‌గానే… స‌ల్మాన్ చాలా ఉత్సాహం చూపించార‌ట‌. ‘రాజ‌మౌళితో అయితేనే ఈ సినిమా చేస్తా’ అన్నార్ట‌. రాజ‌మౌళి కూడా బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. స‌ల్మాన్ అంత‌టి వాడే అడిగితే ఎందుకు కాదంటాడు..? కాబ‌ట్టి ఈ ప్ర‌పోజ‌ల్‌కి రాజ‌మౌళి కూడా ఓకే అనేసిన‌ట్టు టాక్‌. సో… తెలుగు ఈగ ఇప్పుడు బాలీవుడ్ లో ఎగ‌ర‌బోతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close