రాజ‌మౌళికే సాధ్యం కాలేదంటే…

రాజ‌మౌళి.. అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌క ధీరుడు. త‌న ప్లానింగ్ అంతా ప‌ర్‌ఫెక్ట్ గా ఉంటుంది. స్కెచ్ వేశాడంటే తిరుగుండ‌దు. టెక్నిక‌ల్‌గా య‌మ సౌండు. అలాంటి రాజ‌మౌళికే లాక్ డౌన్ ప‌రిమితుల మ‌ధ్య షూటింట్ చేయ‌డం సాధ్యం కాలేదు.

లాక్ డౌన్ నుంచి షూటింగుల‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని చిత్ర‌సీమ ముందు నుంచీ గ‌ట్టిగా కోరుతూ వ‌చ్చింది. ష‌ర‌తుల మ‌ధ్య షూటింగులు చేయ‌డం సాధ్య‌మే అని, గైడ్ లైన్స్‌ని పాటిస్తూ, షూటింగులు పూర్తి చేస్తామ‌ని.. ద‌ర్శ‌క నిర్మాత‌లు ధీమా వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. కావాలంటే ఓ ట్రైల్ షూట్ చేసి, చూపిస్తాం అంటూ రాజ‌మౌళి మాటిచ్చాడు. లాక్ డౌన్ నిబంధ‌న‌ల మేర షూటింగులు ఎలా చేసుకోవొచ్చో చెప్ప‌డానికి త‌న ట్రైల్ షూట్ ఓ రిఫ‌రెన్స్ గా ఉంటుంద‌ని రాజ‌మౌళి భావించాడు. ప్ర‌భుత్వం కూడా స‌రే అంది. అయితే.. ట్రైల్ షూట్ జ‌ర‌క్క ముందే.. షూటింగుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చేసింది.

ప్ర‌భుత్వం కోసం కాక‌పోయినా, హీరోల్ని ఒప్పించ‌డానికి, వాళ్ల‌లో ధైర్యాన్ని నింప‌డానికి, కనీసం త‌న‌కు తాను క్లారిటీ తెచ్చుకోవ‌డానికైనా ట్రైల్ షూట్ చేద్దామ‌ని డిసైడ్ అయ్యాడు రాజ‌మౌళి. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల డూప్‌ల‌తో కొన్ని షాట్లు తీసి – ఆ మొత్తం త‌తంగాన్ని షూట్ చేసి, హీరోల‌కు చూపిద్దామ‌నుకున్నాడు. నిజానికి సోమ‌వారం ట్రైల్ షూట్ ప్రారంభం అవ్వాలి. ఆ రోజు వాయిదా ప‌డి, బుధ‌వారానికి చేరింది. బుధ‌వారం కూడా ట్రైల్ షూట్ చేయ‌లేదు. ఇప్పుడు మొత్తంగా ట్రైల్ షూట్ చేయాల‌న్న ఆలోచ‌నే విర‌మించుకున్నాడ‌ట రాజ‌మౌళి. నిబంధ‌న‌ల మేర‌కు షూటింగ్ చేయ‌డం కుద‌ర‌ని ప‌ని అనే విష‌యం రాజ‌మౌళి కి ఇప్పుడు బోధ‌ప‌డిన‌ట్టుంది. పెద్ద స్టార్ల‌తో.. 40 – 50 మంది క్రూతో షూటింగ్ అనేది జ‌ర‌గ‌ని విష‌యం అనే క్లారిటీకి రాజ‌మౌళి వ‌చ్చాడ‌ట‌. చిన్న సినిమాలైతే ఓకే, ఏదోలా స‌ర్దుకోవొచ్చు. పెద్ద సినిమాల‌కైతే ఎంత మందిని కుదించుకుంటూ వెళ్లినా ప్ర‌భుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ తో షూటింగులు చేయ‌లేమ‌న్న నిర్దార‌ణ‌కు రాజ‌మౌళి వ‌చ్చేశాడు. దాన్ని బ‌ట్టి ఆచార్య‌, పుష్ష‌, ఎఫ్ 3 ఇలాంటి పెద్ద సినిమాలేవీ ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కే ఛాన్సు లేన‌ట్టే.

షూటింగుల అనుమ‌తుల వ‌ల్ల లాభ‌ప‌డింది ఎవ‌రైనా ఉన్నారంటే.. అవి ఛాన‌ళ్లే. టీవీ సీరియ‌ళ్లూ, కొన్ని షోలూ.. ఇప్ప‌టికే మొద‌లైపోయాయి. వ‌చ్చే సోమ‌వారం నుంచి సీరియ‌ళ్లు మొద‌లు కానున్నాయి. షోలూ… య‌ధావిధిగా ప్ర‌ద‌ర్శించ‌డానికి ఛాన‌ళ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close