ఐసొలేష‌న్ వార్డులుగా మారిన రామానాయుడు స్టూడియోస్‌

కోరోనా క‌దం తొక్కుతున్న వేళ‌.. ఆసుప‌త్రిలో ప‌డ‌క‌ల‌కు క‌రువొచ్చింది. చాలామంది రోగులు ఆసుప‌త్రిలో చోటు లేక‌.. చెట్టు కిందో, పుట్ట కిందో సేద తీరుతున్న దృశ్యం క‌ల‌చి వేస్తోంది. ఇలాంటి క్లిష్ట‌మైన ద‌శ‌లో… రామానాయుడు స్టూడియోస్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విశాఖ‌ప‌ట్నంలో రామానాయుడు స్టూడియోని ఐసొలేష‌న్ వార్డులుగా మార్చేసింది. ఇక నుంచి.. ఈ స్టూడియో క‌రోనా రోగుల‌కు వైద్యం చేస్తున్న వైద్యుల‌కు బ‌స‌గా ఉండ‌బోతోంది. ఇదో చ‌క్క‌టి నిర్ణ‌యం. హైద‌రాబాద్ లోనూ చాలా స్టూడియోలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్ర‌భుత్వ భూముల‌తో క‌ట్టుకున్న‌వే. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి కూడా వాటి అవ‌స‌రం ఏర్ప‌డింది. ఎక‌రాల‌కు ఎకరాలు ప్ర‌భుత్వం నుంచి తీసుకుని, స్టూడియోలు క‌ట్టుకుని, డ‌బ్బులు సంపాదించుకున్న వాళ్లంతా ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. వాళ్లంతా.. ముందుకొచ్చి స్వ‌చ్ఛందంగా త‌మ స్టూడియోల్ని క‌రోనా చికిత్స నిమిత్తం ఇస్తే స‌రి. లేదంటే.. త్వ‌ర‌లో ప్ర‌భుత్వ‌మే ఆయా స్టూడియోల్ని కొంత‌కాలం స్వాధీనం చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆ ప‌రిస్థితి రాక‌ముందే… వాళ్లంతా మేల్కొంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close