టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందన్నది లేటెస్ట్ న్యూస్. విజయ్ దేవరకొండ – రష్మిక ల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలు విజయ్, రష్మికలకు కూడా ఎదరయ్యాయి.కానీ వాళ్లు నేరుగా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. ‘ఇది అనువైన సమయం కాదు’ అంటూ తప్పించుకొన్నారు. వాళ్ల మౌనం… ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి డేట్ ఫిక్సయిపోయిందంటూ మరో వార్త మొదలైంది.
ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో వీరిద్దరి వివాహం జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ డేట్‌ని మార్క్ చేసుకొంటున్నారు విజయ్ అభిమానులు. ఉదయ్ పూర్లో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరిద్దరి పెళ్లి చాలా నిడారంబరంగా జరగబోతోందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇప్పుడు ఈ వార్తలపై కూడా విజయ్, రష్మిక స్పందించే అవకాశం లేదు. ఇదే నిజమైతే.. త్వరలో వీరిద్దరి నుంచి ఓ కామన్ ఎనౌన్స్మెంట్ అయితే రావొచ్చు. ‘మేం పెళ్లికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెళ్లి విషయమై విజయ్ పీ.ఆర్ కూడా సైలెంట్ గా ఉంది. ‘అవును’ అని కానీ ‘కాదు’ అని కానీ వాళ్లు కూడా సమాధానం చెప్పడం లేదు. విజయ్ – రష్మిక కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడో సినిమా ‘రణబాలి’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్.. రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే.


