కిడారి, సోమ హత్యలపై మావోయిస్టుల స్పందన ఎందుకు లేదు..?

విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోమలను అత్యంత దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా విడుదల చేయకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడైనా.. ఏదైనా సంచలనాత్మక ఘటన చేపడితే.. మావోయిస్టులు ఘనంగా చెప్పుకుంటారు. ఎందుకు చేశామో కూడా చెబుతారు. 90 శాతం ఘటనల్లో… లేఖలు విడిచి పెట్టి వెళతారు. తాను చేసిన పనికి కారణాలేమిటో కూడా.. అందులో చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపిన తర్వాత ఇది మా పనేనని.. వాళ్లు ఫలానా తప్పు చేశారని మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదు. ఏ దళమూ… తమ ఘనతేనని చెప్పుకోలేదు.

ఇదే పోలీసుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా… కిడారి సర్వేశ్వరరావును.. కాల్చే ముందు… తెలుగుదేశం పార్టీలోకి మారేందుకు ఎంత తీసుకున్నావని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కిడారి డ్రైవర్‌ను కూడా మావోయిస్టులు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు ఎంత తీసుకున్నారో తెలుసా అని ఓ సాధారణ వైసీపీ కార్యకర్త అడిగినట్లు అడగడం పోలీసు వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఓ వైపు ముసురుకుంటున్న అనుమాలకు కోడు.. మావోయిస్టులు ఎందుకు దీన్ని క్లెయిమ్ చేసుకోవడం లేదని మరో ప్రశ్న. మావోయిస్టులు అన్ని రాజకీయప పార్టీలను ఒకేలా చూస్తారు.. ఓ పార్టీపై ప్రత్యేకమైన అభిమానం అంటూ చూపరు. కానీ.. కిడారి, సోమల హత్యల విషయంలో మాత్రం.. కొంచెం తేడా కనిపిస్తోంది. మావోయిస్టులు అగ్రనేతలంకా దాదాపుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వారిలో కుల పిచ్చి పెరిగిపోయిందనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి.

ఇటీవలి కాలంలో కొన్ని రాజకీయపార్టీలతోనూ.. వీరికి సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణగానే కిడారి సర్వేశ్వరరావు పార్టీ మార్పుపై… మావోయిస్టులు పదే పదే ప్రశ్నలు సంధించారనే అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో కిడారిని, సోమను లిపిటిపుట్టు గ్రామానికి పిలిపించింది కూడా స్థానిక వైసీపీ నేతేనన్న ప్రచారం కూడా ఉద్ధృతంగా సాగుతోంది. అదే సమయమంలో జగన్ మీడియా… కిడారి, సోమ ఇద్దరూ మైనింగ్ చేస్తున్నారనే ప్రచారం కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి వారిద్దరికీ ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవు. ఆ విషయం అక్కడి గిరిజనలుకు తెలుసు. సివేర సోమ ఎమ్మెల్యేగా కూడా చేశారు. కానీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి.. జాలిపడని వారు లేరు. ఇన్ని రోజులైనా మావోయిస్టులు ప్రకటన చేయకపోవడం… పెద్దగా ఆరోపణలు లేని .. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చడం వెనుక..మావోయిస్టుల పార్టీలోనే అభిప్రాయ బేధాలున్నాయని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close