తెంచుకోవద్దు – ఊరుకోవద్దు – ఇది బిజెపి లైన్

• తెంచుకోవద్దు – అలాగని ఊరుకోవద్దు
తెలుగుదేశం పట్ల బిజెపి వైఖరి
• కేంద్రాన్ని బాబు ప్రత్యేకహోదా అడగనేలేదు!

 

తెలుగుదేశంతో మిత్రబంధాన్ని సాగిస్తూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏమేమి చేస్తోందో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం మూడుగంటల పాటు కమిటీ సమావేశమైంది.

ప్రత్యేక హోదాపై ఆందోళనలు-బీజేపీ వైఖరి, కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. బిజెపి – ఎపి ఇన్‌చార్జ్ సిద్ధార్థనాథ సింగ్, మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, బీజేపీ నేతలు హరిబాబు, విష్ణురాజు, సోము వీర్రాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు.

టీడీపీ రాజకీయ ఎత్తుగడలకు బిజెపి నష్టపోతోందని సమావేశం దాదాపు ఏకగ్రీవంగా భావించింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని…. ఆ లేఖల్లో ఎక్కడా ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించలేదని సమావేశంలో సిద్ధార్థనాథ సింగ్ స్పష్టం చేశారని తెలిసింది.

కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు, వాటికి రాష్ట్రం లెక్కలు చెప్పని వైనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ప్రస్తుతానికి ప్రత్యేక హోదాపై అన్ని పార్టీల విమర్శలకు, తెలుగుదేశం రాజకీయాలకు సమాధానమని కోర్ కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకునే తెలుగుదేశం అనైతిక రాజకీయాల ప్రభావం బిజెపి మీద కూడా పడుతుందని సోము వీర్రాజు ప్రస్తావించగా ఇన్ చార్జ్ సూచనపై తెలుగుదేశం ఆంతరంగిక విషయాలలోకి మనంపోవద్దని సమావేశం అభిప్రాయపడింది. అయితే దీనిపై సగంమంది మౌనంగానే వుండిపోయారని తెలిసింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర బీజేపీ నేతలకు సిద్దార్థనాథ్‌సింగ్ తేల్చిచెప్పారు. హోదా కంటే ఎక్కవ మేలే జరుగుతుందన్నారు. కేంద్ర నిధుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదని కొందరు నేతలు ఆరోపించారు. అయితే కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, టీడీపీతో మిత్ర బంధం కొనసాగిస్తూనే రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రత్యేక హోదాను తిరస్కరించింది కాంగ్రెస్ నియమించిన 14వ ఆర్థిక సంఘమే అని వివరిస్తూ ఏపీకి త్వరలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని సిద్దార్థనాథ్‌సింగ్ సమావేశంలో చెప్పారని తెలిసింది.

తెలుగుదేశంతో సంబంధాలపై బిజెపి రాష్ట్రనాయకుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ”ప్రస్తుతానికి సముదాయించడమే” ఈ సమావేశపు సారాంశమని అర్ధమౌతోంది. అయితే, ప్రత్యేక హోదా, ఎపి క సహాయం మాట వచ్చిన ప్రతీ సారీ ”మేము ఇంతింత ఇచ్చాము – దానికి ఎప్పుడు లెక్క చెబుతారు” అనే సమాధానాన్ని నేరుగా ప్రజల్లోకే తీసుకు వెళ్ళాలన్నది కూడా తెలుగుదేశాన్ని డిఫెన్స్ లో పెట్టాలన్న పెద్ద అడుగే! ఆనిర్ణయానికి కూడా బిజెపి ఎపి కోర్ కమిటి శుక్రవారపు సమావేశమే వేదిక అయ్యింది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close