రేణుదేశాయ్, అమలా పాల్…పురుషాహంకార బాధితులా?

మనం స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్నాం. కంప్యూటర్ కాలంలో ఉన్నాం. మనం చాలా ఆధునికులం అని మన గురించి మనమే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కానీ మనలో ఇంకా చాలా మంది మాత్రం సతీసహగమన కాలం నాటి ఛాదస్తాలతో ఉన్నారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా మనలో చాలా మందిలాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఆలోచనలే… ఆది మానవుల స్థాయిలో ఉన్నాయి. పెళ్ళయిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు తీసుకోకూడదు. ఒకవేళ అలా విడిపోయినా ఆ తర్వాత నుంచి తెల్ల చీర కట్టుకుని ఇంట్లో కూర్చోవాలి. భర్త చనిపోయిన స్త్రీ ఎలా ఉండాలని ఇలాంటి బాపతు జనాలు అనుకుంటూ ఉంటారో ఇఫ్పుడు భర్తతో విడిపోయిన స్త్రీలు కూడా అలాగే ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారు.

ఈ విషయంలో మీడియా కూడా ఏమీ తక్కువ తినలేదు. భర్తతో విడిపోయిన హీరోయిన్స్ అందరికీ ఎవరో ఒకరితో ఎఫైర్ ఉందని చెప్పడానికి చాలా చాలా ట్రై చేస్తోంది. అమలా పాల్‌కి ఓ తమిళ్ యువహీరోతో ఎఫైర్ ఉందని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో? అమలా పాల్ హీరోయిన్‌గా కంటిన్యూ అవ్వాలనుకుంటోంది. విజయ్ విషయం పక్కన పెడితే, విజయ్ ఇంట్లో వాళ్ళకు మాత్రం అది అస్సలు ఇష్టం లేదు. అందరూ కలిసి వ్యవహారాన్ని విడాకుల వరకూ తీసుకుని వచ్చారు. ఆ సందర్భంలో కూడా విజయ్‌తో పాటు అతని ప్యామిలీ మెంబర్స్ కూడా అమలా వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపేలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ మాటలను విమర్శించిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ అమలాపాల్‌ని ఎలా విమర్శిద్దామా అనే ఆలోచించినవాళ్ళే. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కి రెగ్యులర్‌గా హీరోయిన్స్ వేసుకునే కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్‌లో అమలా పాల్ కనిపించగానే అందరూ రెచ్చిపోయారు. అలాంటి డ్రెస్సులు వేసుకుని పబ్లిక్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయడం తప్పా? ఒప్పా? అని డిస్కస్ చేస్తే తప్పులేదు. కానీ పెళ్ళయి, విడాకులు తీసుకున్న లేడీస్ అలా రాకూడదని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అమలా పాల్ హ్యాపీగా ఉండడం కూడా చాలా మందికి నచ్చుతున్నట్టుగా లేదు. మగవాడి నుంచి విడిపోయిన అమ్మాయి ఏడుస్తూ ఉండాలి. అలా జరగడం లేదంటే ఇంకో మగాడితో రిలేషన్‌లో ఉన్నట్టే అనేది మనలో చాలా మందికి ఉండే ఓ ఫిక్స్‌డ్ అభిప్రాయం. అమ్మాయిల ఆనందం అంతా… వాళ్ళు మగవాళ్ళతో ఉన్నంత కాలమే అని ఓ మూర్ఖపు సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. అందుకే విడిపోయిన తర్వాత కూడా రేణు దేశాయ్, అమలా పాల్ లాంటి వాళ్ళు సంతోషంగా ఉండడం చాలా మందికి నచ్చడం లేదు. వాళ్ళు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి లాంటి విషయాలను తమ చేతుల్లోకి తీసుకుందామని చాలా మంది చాదస్తులు ఆలోచిస్తున్నారు. పెళ్ళికి ముందా? పెళ్ళికి తర్వాతా? విడిపోయాకా? అన్న విషయాలను పక్కన పెడితే స్వతంత్రంగా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా చాలా చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉన్న స్త్రీలు మన కళ్ళముందే చాలా మంది ఉన్నారు. మన ‘ఛాదస్తపు మగాడి కళ్ళద్దాల’ను కాస్త పక్కన పెట్టి చూస్తే ఆ కొత్త ప్రపంచంలో ఉన్న మహిళలు కూడా కనిపిస్తారు. మన చాదస్తం మనది అనుకుంటే మాత్రం అమలా పాల్‌తో పాటు ఇంకా మన చుట్టు పక్కల ఉన్న చాలా మంది స్త్రీల చేత కూడా ‘మహిళలను గౌరవించడం నేర్చుకో…’ అని చెప్పించుకోవాల్సి ఉంటూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close