“పార్టీ ఫిరాయింపుల”పై టీఆర్ఎస్ ఉలిక్కి పడేలా చేసిన రేవంత్..!

కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలిచినా ఉంటారో ఉండరో తెలియదు… ఆ పార్టీకి ఓటేయడం ఎందుకు..? అన్నది ఇప్పటి వరకూ జోరుగా జరుగుతున్న ఓ రకమైనచర్చ. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్పి… కాంగ్రెస్ పార్టీలో గెలిచినా టీఆర్ఎస్‌లోకే వస్తారని.. అందుకే టీఆర్ఎస్‌నే గెలిపించాలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రచారం కాంగ్రెస్‌కు చాలా మైనస్ చేసింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత వ్యూహాత్మకంగా ఈ ప్రచారానికి తెరదించేందుకు రాజకీయాలు ప్రారంభించారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపుడేనని ఘాటు ప్రకటన చేశారు. దీంతో .. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లోచురుకుపుట్టింది.

వరుసగా మీడియా సమావేశం పెట్టి రేవంత్‌ను దూషించడం ప్రారంభించారు. అయితే రేవంత్ కోరుకున్నది ఈ ఎఫెక్టే. పార్టీ మార్పులపై విస్తృతమైన చర్చ జరగాలని ఆయన కోరుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించడంతో ఇక కాంగ్రెస్ నేతలు ఊరుకోలేదు.. సీతక్క సహా అందరూ రంగంలోకి దిగి.. వారిపై ప్రతి విమర్శలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా లేనప్పుడు… పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేవారు లేరు.. కనీసం వెళ్తున్న వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో.. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగడం… సొంత ప్రయోజనాల కోసం వెళ్లేవారి ఇష్టారాజ్యం అయిపోయింది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం.. బాధ్యతలు చేపట్టక ముందే ఓ ఊపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.

ఎమ్మెల్యేల అవసరం లేకపోయినా… కాంగ్రెస్ పార్టీ నేతల్ని.. టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వైనం మెల్లగా రేవంత్ ప్రజల్లో చర్చకు పెడితే.. అది టీఆర్ఎస్‌కు మరింత మైనస్ అవుతుంది. అందుకే.. పార్టీ మారిన వాళ్ల గురించి ప్రజలే నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు. మొత్తానికి రేవంత్.. పీసీసీ చీఫ్‌గా..కాంగ్రెస్‌కు ఉన్నరోగాలన్నింటికీ వీలైనంత వేగంగా మందులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లు ఎవరూ నోరెత్తకపోయినా.. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close