రివైండ్ 2017: ప‌డి లేచిన కెర‌టాలు

విజ‌యం ఒక‌రి సొత్తుకాదు. ఎవ‌రైనా ఎప్పుడైనా హిట్టు కొట్టొచ్చు. ప‌రాజ‌యం ఒక‌రి ఇంటి పక్షి కాదు. ఎవ‌రి గూటికైనా చేరిపోవ‌చ్చు. జ‌యాప‌జ‌యాల దోబూచులాట చిత్ర‌సీమ‌లో మామూలే. 2016లో చాలామంది ఫ్లాపులు చ‌వి చూశారు. కొంత‌మంది కొన్నేళ్లుగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. వాళ్లంద‌రికీ 2017 ఉత్సాహాన్నిచ్చింది. విజ‌యాల్ని అందించింది. భ‌విష్య‌త్తుపై ఆశ‌లు రేకెత్తించింది. 2017లో త‌మ‌జాత‌కాన్ని మార్చుకున్న‌వాళ్లెవ్వరో ఓసారి రివైండ్ చేసుకుంటే…

2017 వెండితెర పులకించిపోయింది. మెగాస్టార్ రాకతో. అసలు సిసలైన హీరోయిజంకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. దాదాపు తొమ్మిదేళ్ళ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో మరోసారి ప్రేక్షకులను తనకే సాధ్యమైన స్టార్ డమ్ తో బంధీచేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మెగాస్టార్ ఆ అంచనాలను అందుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఖైదీ నెంబర్ 150తో అభిమానులు కోరుకున్నారు వినోదాలు పంచింది. మొత్తంమ్మీద 2017మెగాస్టార్ రీఎంట్రీ అదిరింది.

రవితేజ యాటిట్యుడే కాదు.. ఆయన సినిమాల మేకింగ్ కూడా విపరీతమైన ‘ఫాస్ట్’ గా జరుగుతూవుటుంది. ఓ సినిమా పూర్తయ్యేలోగా మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోతుంటుంది. అయితే ఆయన ఒక్కసారిగా స్లో అయిపోయారు. బెంగాల్ టైగర్ తర్వాత మళ్లీ కెమరా ముందుకు రావడానికి ఆయనకి ఏడాదన్నర పట్టింది. ఏవో వ్యక్తిగత కారణాల వల్ల గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ గ్యాప్ ను రాజాది గ్రేట్ తో ఫిల్ చేశారు. కెరీర్ లో తొలిసారి బ్లైండ్ పాత్రను పోషించిన మాస్ మహారాజా ప్రేక్షకులతో నిజంగానే రవితేజ ది గ్రేట్ అనిపించుకున్నారు.

యాంగ్రీ యంగ్ మెన్ గా ఓ వెలుగు వెలిగారు రాజశేఖర్. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశారు. అయితే ఒక్కసారిగా ఆయన మార్కెట్ డౌన్ అయిపోయింది. కాని హీరోయిజం మాత్రం వదలడం లేదు. ఎలాగైనా ఒక హిట్ కొట్టాలని తపించారు. ఈ క్రమంలో చాలా ప్రయోగాలు చేశారు. కానీ ఏది విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఒక హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన రాకశేఖర్ కి 2017కలిసొచ్చింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగతో హీరోగా ఆయన ఖాతాలో ఒక హిట్ పడినట్లయింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత చేసిందనే మాట పక్కన పెడితే.. రాజశేఖర్ కు కొత్త ఊపిరినిచ్చింది.

తొలి సినిమా ఆనంద్ తోనే తన మార్క్ ఏమిటో చూపించాడు శేఖర్ కమ్ముల. గోదారి , హ్యాపీ డేస్ లీడర్ లాంటి విలక్షణ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాధించుకున్నాడు. సహజంగానే కాస్య గ్యాప్ లు ఇస్తూ సినిమాలు చేసే శేఖర్.. 2014లో వచ్చిన అనామిక తర్వాత మళ్ళీ సినిమా తీయలేదు. అయితే 2017లో మళ్ళీ తన మ్యాజిక్ చూపించాడు. ప్రేక్షకులను ఫిదా చేశాడు. పెద్ద అంచనాలు లేకుండా వచ్చినీ సినిమా శేఖర్ కమ్ముల సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాతో తన క్యాలిబర్ ఏంటో మరోసారి రిజువు చేశాడు శేఖర్ కమ్ముల.

సుమంత్ కి హిట్ పడి పుష్కరం దాటింది. సినిమాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయితే 2017లో గేర్ మార్చాడు. ఈ ఏడాది రెండు సినిమాలు చేశాడు. బాలీవుడ్ హిట్ విక్కి డోనర్ రిమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో సంచనలం నమోదు చేసిన ఈ సినిమా తనకూ ఓ బ్రేక్ ఇస్తుందని అనుకున్నాడు. ఐతే ఈ సినిమా కూడా పల్టీ కొట్టేసింది. అయితే రీసెంట్ గా వచ్చిన మళ్ళీ రావా సినిమాకి మంచి ఎప్లాజ్ వచ్చింది. ఈ సినిమా వసూళ్ళు మాట ఎలా వున్నా .. హీరోలో నేనూ వున్నానని అనిపించాడు సుమంత్.

సౌత్ లో దాదాపు అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది శ్రియా. ఇప్పుడు కీర్తి సురేష్ , అను ఏమ్మన్యుల్, రకుల్.. ఎలా అదరగొడుతున్నారో అలాగే తన టైం నడుస్తున్నప్పుడు అదే రేంజ్ లో రెచ్చిపోయింది శ్రియా. అయితే తర్వాత కాలంలో కొత్త నీరు రావడంతో అలా ఆమె హవా తగ్గింది, ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పాత్రలు కూడా తగ్గిపోయాయి. అయితే ఈ ఏడాది మళ్ళీ హీరోయిన్ గా బౌన్స్ బ్యాక్ అయ్యింది. గౌతమీ పుత్ర శాతకర్ణితో సోలో విజయం ఖాతాలో వేసుకుంది. తర్వాత పైసా వసూల్ చేసింది. మొత్తంమ్మీద సినియర్ హీరోలకు మళ్ళీ ఒక ఆప్షన్ లా కనిపిచింది శ్రియా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close