ఏపీలో ప్రజాస్వామ్యం లేదంటున్న ఆర్జీవీ..! టీడీపీ వాళ్లూ అదే అంటున్నారుగా..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా… విజయవాడకు వచ్చిన ఆర్జీవీని… పోలీసులు సిటీలోకి అడుగు పెట్టనీయలేదు. ఆయన రోడ్డు మీద.. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ప్రెస్‌మీట్ పెడతానని సోషల్ మీడియాలో ముందే ప్రకటించి రావడంతో.. పోలీసులు ముందు జాగ్రత్తగా.. అడ్డుకుని.. వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రానీయలేదు. దీంతో వర్మ… ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని బాధపడిపోయారు. విమానాశ్రయంలో కూర్చుని ఓ వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి బెదిరింపులతో హోటళ్లు, క్లబ్బుల్లో.. తన సినిమా ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వలేదని బాధపడిన ఆయన… అదంతా… టీడీపీ వాళ్లే్ కావాలని చేస్తున్నట్లుగా.. చెబుతున్నారు. కానీ.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని.. టీడీపీ వాళ్లు కూడా బాధపడుతున్నారు. అయితే వాళ్ల వెర్షన్ వేరు.

ప్రజాప్రభుత్వం ఉండగానే.. కోడ్ పేరుతో… అధికారాల్ని… దూరం చేశారని టీడీపీ నేతలు.. ఎన్నికల సంఘం పై మండి పడుతున్నారు. చివరికి.. ఏ ప్రభుత్వ అధికారి కూడా.. రాజకీయ నాయకుల ఆదేశాల్ని పాటించవద్దని.. మౌఖికంగా… సీఎస్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పుడు ఏపీలో వివాదం రేగుతోంది. ముఖ్యమంత్రికి.. కనీసం ఇంటలిజెన్స్ చీఫ్ కూడా రిపోర్ట్ చేయడం లేదు. అంటే.. ఇప్పుడు టీడీపీ అధికార పార్టీనే. కనీసం.. కానిస్టేబుల్‌కు ఆదేశం ఇచ్చినా.. అది వివాదం అయిపోతోంది. అందుకే ప్రజాస్వామ్యం లేదని… ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని ఈసీ, సీఎస్ తుంగలో తొక్కుతున్నారని మండి పడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఆర్జీవీ కూడా వ్యక్తం చేశారు. కాకపోతే.. ఆయనకు ఇంకా రాజకీయం అర్థం అయినట్లుగా లేదు. టీడీపీనే ఇలా చేయిస్తోందని అనుకుంటున్నారు.

ఆర్జీవీ.. రోడ్‌ మీద ప్రెస్ మీట్ పెడితే.. టీడీపీ నేతలు సైలెంట్ గా ఉండరు. అలా అని ఆర్జీవీకి సపోర్ట్ లేకుండా ఉండదు. పోటీగా.. వైసీపీ నేతలు వస్తారు. దాంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఊహించి పోలీసులు ఎన్నికల సందర్భంగా పెట్టిన సెక్షన్ 30, సెక్షన్ 144 సెక్షన్లతో … వర్మకు… ఎయిర్ పోర్టులోనే నోటీసులిచ్చి.. ఆయనను.. మళ్లీ ఎయిర్ పోర్టులోనే దింపారు. వర్మకు.. హైదరాబాద్ వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే ప్రజాస్వామ్యం లేదు. కానీ దానికి వర్మ అనుకున్నట్లుగా టీడీపీ కారణం కాదు. అదే … చంద్రబాబు చీఫ్ మినిస్టర్‌గా ఉండి ఉంటే.. కచ్చితంగా… పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరీ..ఆర్జీవీకి సినిమా ప్రమోషన్ చేసుకునే అవకాశం దక్కి ఉండేది. విమర్శలు వస్తాయని… చంద్రబాబు ఆ మాత్రం.. నిర్ణయం తీసుకుని ఉండేవారు. కానీ.. వర్మ బ్యాడ్ లక్.. ! ఏపీలో ఇప్పుడు నడిచేది కొత్త రాజకీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close