జగన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని ఆర్కే వినియోగించుకుంటున్నారు. గత వారం అంతా ఆర్కేను టార్గెట్ చేసి ధర్నాలు, నిరసనలు చేపట్టిన వైసీపీ తీరుపై ఆయన పరోక్షంగా జాలి పడి.. త న ఇమేజ్ ను ఎలివేట్ చేసుకునేందుకు ఈ పరిణామాల్ని పక్కాగా వాడుకుంటున్నారు. మళ్లీ కొత్తపలుకులో జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ రెడ్డి చంద్రబాబుకు ఏ మాత్రం సరి తూగడని.. తాను మాత్రమే అసలైన ప్రత్యర్థినని.. తనతో పోటీ పడాలని ఆయన సవాల్ చేశారు. అంతే కాదు.. జగన్ రెడ్డిపై వేయడానికి తన వద్ద అణుబాంబు ఉందని కూడా ప్రకటించారు. ఆ అణుబాంబు ఏమిటో మాత్రం చెప్పలేదు.
పాతికేళ్ల కిందట.. వైఎస్ కుటుంబంలో ఏదో జరిగింది. అది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కంటే హీనమైనది. దాన్ని చేసింది జగన్ రెడ్డి. దాని గురించి బయటపెడితే జగన్ రెడ్డిని ప్రజలు మరింతగా ఛీ కొడతారని ఆర్కే చెబుతున్నారు. అయితే ఇప్పుడు తాను బయటపెట్టబోనని చెప్పారు. జగన్ రెడ్డి తనపై పోరాటానికి రెడీ అినప్పుడు ఆయన దాన్ని బయట పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆర్కే ఇలా.. హింట్ ఇచ్చి వదిలేయడం కూడా జగన్ రెడ్డిపై దాడి చేసినట్లే. మీడియా, సోషల్ మీడియా ఊరుకుంటాయా ?. చరిత్రను తవ్వేస్తాయి. పాతికేళ్ల కిదంట వారి కుటుంబంలో ఏం జరిగిందో ఆరా తీస్తాయి. జగన్ తో లింకులు పెట్టి అనుమానాలు ప్రారంభిస్తాయి. ఇవి పీక్స్ కు వెళ్లినప్పుడు అసలు నిజాన్ని ఆర్కే బయట పెట్టవచ్చు. అప్పుడు జగన్ పరిస్థితి మరింత దారణంగా ఉంటుంది.
ఈ ఆర్టికల్ మొత్తం జగన్ రెడ్డి నైజాన్ని, ఆయన కార్యకర్తల బ్రెయిన్ లెస్ తనాన్ని పక్కాగా ఎక్స్ పోల్ చేసిన ఆర్కే.. అదే సమయంలో తనకు ఎలివేషన్లు కూడా తగ్గించుకోలేదు. వైసీపీ నేతలు ఏ అంశంపై ఆందోళన చేశారో…ఆ మాటకీ వివరణ ఇచ్చి.. తప్పు తనది కాదని.. అలా అర్థం చేసుకున్నవారిదేనని ఎదురుదాడి చేశారు. నిజానికి అది తప్పు అని అనిపించేలా చేసింది ఆర్కేనే. వీడియోలో ఉన్నదాన్ని ప్రింట్ లో కూడా ఉంచినట్లయితే.. వివాదం అయ్యేది కాదు..కానీ ప్రింట్ లో తీసేయడంతో.. తప్పు చేశానని ఆర్కేకు అర్థమయింది కాబట్టే తీసేశారని వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అది వివాదం పెరగాడనికి కారణం అయింది.
జగన్ రెడ్డి రాజకీయం ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థితో కాకుండా.. మీడియా యజమానులతో పెట్టుకోవడం అనే తప్పుడు ట్రాక్ లో వెళ్తోంది. గతంలోనూ ఈ మీడియా ఉంది. ఆయనపై కథనాలు వచ్చాయి. అయినా ఆయన గెలిచారు. మళ్లీ ఓడారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర మీడియాది. గెలుపోటముల్ని నిర్దేశించలేదు. ప్రభుత్వాలపై వ్యతిరేకత అనేది నేరుగా ప్రజలు కష్టాలు ఫీల్ అయితేనే వస్తుంది. దాన్ని జగన్ గుర్తించలేకపోతున్నారు. మీడియాపై యుద్ధం ప్రకటించి తనకు రాజకీయం తెలియదని నిరూపించుకుంటున్నారు. ఆర్కే దాన్ని తెలివిగా ఉపయోగించుకుంటున్నారు.

