ఈ ‘రూల‌ర్‌’.. ఫ్యామిలీస్‌కి దూర‌మా?

బాల‌య్య ‘రూల‌ర్‌’గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తున్నాడు. శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్‌ని పీక్స్‌లో చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు బై ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి రెండున్న‌ర గంట‌లు.

యాక్ష‌న్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. 4 ఫైట్లున్నాయ‌ట‌. బాల‌య్య ఫైటింగులు మాస్‌కి బాగానే ఎక్కేస్తాయి. అయితే ఆ ఫైట్స్‌లో ర‌క్త‌పాతం, హింస ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయని, ఈ రేంజులో సినిమా ఉంటే.. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం చాలా క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. మాస్ డైలాగులు పేజీల కొద్దీ చెప్పేశార‌ని, అందులో మోతాదు ఎక్కువైన సంభాష‌ణ‌లు వినిపించాయ‌ని టాక్‌. ఈ విష‌యం ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మైపోతుంది. బాల‌య్య సినిమా ‘జైసింహా’ కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. న‌య‌న‌తార ఎపిసోడ్ మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. కాక‌పోతే `రూల‌ర్‌`లో అలాంటి అంశాలేం క‌నిపించ‌డం లేదు. మ‌రి… రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close