బుర్రా సాయిమాధ‌వ్ చేతిలో మ‌రో క్రేజీ ప్రాజెక్టు

ఈమ‌ధ్య పెద్ద సినిమా ఏదైనా స‌రే.. డైలాగ్ రైట‌ర్ గా బుర్రా సాయిమాధ‌వ్ పేరే వినిపిస్తోంది. ఎలాంటి క‌థ‌కైనా.. చురుకైన‌, సొగ‌సైన‌, లోతైన మాట‌ల్ని రాయ‌డంలో ఆయ‌న పండిపోయారు. అందుకే… పెద్ద సినిమాల‌న్నీ ఆయ‌న పంచ‌న చేరుతున్నాయి. తాజాగా ఆయ‌న చేతిలో మ‌రో క్రేజీ ప్రాజెక్టు చేరింది. రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రానికి డైలాగ్ రైట‌ర్ గా బుర్రా సాయిమాధ‌వ్ ఫిక్స్ అయ్యారు. అంతే కాదు.. రామ్ – లింగు స్వామి సినిమాకీ బుర్రానే డైలాగ్ రైట‌ర్‌. బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికీ ఆయ‌నే ర‌చ‌యిత‌. ప్ర‌భాస్ – నాగ అశ్విన్ సినిమా కూడా సాయిమాధ‌వ్ చేతిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇలా… భారీ ప్రాజెక్టుల‌న్నీ బుర్రాని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. ప్ర‌స్తుతం `వీర‌మ‌ల్లు` చిత్రానికి బుర్రా సంభాష‌ణ‌లు స‌మ‌కూరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close