ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌

నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకి ఎన్టీఆర్ లుక్ మారిస్తే… అదో ట్రెండ్ అయ్యింది. ఆ గెడ్డం ఏంటి? ఆ హెయిర్ స్టైలేంటి?? అనుకొన్న‌వాళ్లంతా సినిమా చూసి.. తార‌క్‌కి ఈ గెట‌ప్ భ‌లే సూట‌య్యింద‌బ్బా అంటూ మాట్లాడుకొన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్సంతా నాన్న‌కు ప్రేమ‌తో.. నుంచి ఆ గెట‌ప్పే ఫాలో అయిపోయారు. ఎన్టీఆర్ తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. తన సినిమాల్లో హీరోల్ని స్టైలీష్‌గా, అందంగా చూపిస్తుంటాడాయ‌న‌. జ‌న‌తా గ్యారేజీలోనూ ఎన్టీఆర్ లుక్ కొత్త‌గా ఉంటుంద‌ని భావించారు తార‌క్ అభిమానులు. కానీ.. వాళ్లంద‌రికీ ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడు.

జ‌న‌తా గ్యారేజ్‌కి సంబంధించిన కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఇదేంటి?? అని బుర్ర గోక్కుంటున్నారు. దానికి కార‌ణం.. ఎన్టీఆర్ గెడ్డం, అత‌ని హెయిర్ స్టైల్‌. నాన్నకు ప్రేమ‌తో సినిమాలో ఎలా క‌నిపించాడో ఇంచుమించు అలానే ఈ సినిమాలోనే క‌నిపిస్తున్నాడు తార‌క్‌. దాంతో కొత్త సినిమాలో తార‌క్ కొత్త లుక్‌లో క‌నిపిస్తాడ‌ని ఆశించిన అభిమానులు భంగ‌ప‌డ్డారు. తార‌క్ పాత్ర రెండు ర‌కాలుగా ఉంటుంద‌ని, సెకండ్ క్యారెక్ట‌ర్లో ఎన్టీఆర్‌ని కొర‌టాల స్టైలీష్‌గా చూపించ‌బోతున్నాడ‌న్న మ‌రో టాక్ కూడా వినిస్తోంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు అదే ఊర‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com