‘మ‌హా స‌ముద్రం’ ఫ్లాప్‌పై స్పందించిన సిద్దార్థ్‌

మ‌హా స‌ముద్రంపై అప్ప‌ట్లో చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆర్‌.ఎక్స్ 100 త‌ర‌వాత అజ‌య్ భూప‌తి చేసిన సినిమా అది. శ‌ర్వానంద్ హీరో. విల‌న్‌గా సిద్దార్థ్ న‌టించాడు. కాస్టింగ్ బాగా కుదిరింది. దాంతో.. ఆశ‌లు పెరిగాయి. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో సిద్దూ మాట‌లు చూస్తే – మ‌హా స‌ముద్రం చ‌రిత్ర తిర‌గ రాస్తుంద‌ని అనిపించింది. అంత కాన్ఫిడెన్స్ చూపించాడు ఆ సినిమాపై. తీరా చూస్తే సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. చాలా రోజుల త‌ర‌వాత ఈ ఫ్లాప్ పై సిద్దార్థ్ నోరు విప్పాడు.

మ‌హా స‌ముద్రం ఇప్ప‌టికీ తన ఫేవ‌రెట్ ఫిల్మ్ అని, కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల జ‌నం ఆద‌రించ‌లేద‌ని, స్నేహితుడి ప్రేయ‌సిని హీరో పెళ్లి చేసుకోవ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే తిర‌స్క‌రించార‌ని కాస్త లేట్‌గా అయినా, క‌రెక్ట్ రివ్యూనే ఇచ్చాడు సిద్దూ. ”మ‌హాస‌ముద్రం సినిమా నాకు వ్య‌క్తిగ‌తంగా చాలా ఇష్టం. ఆ సినిమాకి వంద మంది ప‌ని చేస్తే వంద‌మందీ సూప‌ర్ హిట్ట‌ని బ‌లంగా న‌మ్మారు. కానీ ఫ‌లితం రాలేదు. అంత మాత్రాన అది త‌ప్పుడు సినిమా కాదు. ఇప్ప‌టికీ అజ‌య్ భూప‌తితో ప‌నిచేయ‌డానికి నేను సిద్ధంగా ఉన్నా. త‌ను గొప్ప టెక్నీషియ‌న్‌. ఆర్.ఎక్స్ 100కి మించిన సినిమాలు త‌న నుంచి చాలా వ‌స్తాయి..” అంటూ త‌న ద‌ర్శ‌కుడ్ని వెన‌కేసుకొని వ‌చ్చాడు.

”కొంత‌మంది ‘ఇంకో ప‌ది ఏళ్ల త‌ర‌వాత రావాల్సిన సినిమా ఇది.. ముందే తీసేశారు..’ అని చెబుతుంటారు. అలాంటి మాట‌ల్ని నేను న‌మ్మ‌ను. ఇప్పుడు – ఈ టైమ్‌లో ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందా? లేదా? అనేది ముఖ్యం. నా ‘చుక్క‌ల్లో చంద్రుడు’ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ కొంత‌మందికి అది ఫేవ‌రెట్ సినిమా. ప‌దేళ్ల త‌ర‌వాత తీయాల్సింది అంటుంటారు. అలాంటి మాట‌లు వింటుంటే న‌వ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు అని చెప్పుకొచ్చాడు సిద్దూ. త‌ను హీరోగా న‌టించిన ‘ట‌క్క‌ర్‌’ ఈ వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close