సందీప్ కిష‌న్‌కి గాయాలు

ఓ షూటింగ్‌లో నాగ‌శౌర్య కాలికి గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న జ‌రిగి ఒక్క రోజు గ‌డ‌వ‌క‌ముందే.. ఇప్పుడు మ‌రో హీరో గాయ‌ప‌డ్డాడు. అదీ సినిమా షూటింగ్‌లోనే. త‌నే సందీప్ కిష‌న్‌. త‌న కొత్త సినిమా `తెనాలి రామ‌కృష్ణ‌`. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూలులో జ‌రుగుతోంది. సందీప్ కిష‌న్‌పై ఓ ఫైట్ సీన్ తీస్తున్నారు. బ‌స్ బ్లాస్ట్ అవుతుండ‌గా సందీప్ అందులోంచి ఎగురుకుంటూ కింద ప‌డే షాట్ తెర‌కెక్కించే స‌మ‌యంలో… ప్ర‌మాద‌వ‌శాత్తూ సందీప్ గాయ‌ప‌డ్డాడు. త‌న‌ని హుటాహుటిన క‌ర్నూలులోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. ఫైట్ మాస్ట‌ర్ త‌ప్పిదం వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని, సందీప్‌కి అయిన గాయం పెద్ద‌దేమీ కాద‌ని, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ షూటింగ్‌లో పాలుపంచుకుంటార‌ని చిత్ర‌బృందం తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com