బీజేపీతో టీడీపీ – ఢిల్లీలో ఏం జరుగుతోందంటే ?

తెలుగుదేశం , బీజేపీ మధ్య గత కొద్ది రోజులుగా ఏదో కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోంది. అదేమిటన్నది చాలా మంది అర్థం కావడం లేదు. మాట కంటే ముందు టీడీపీని విమర్శించే జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లంతా వరుసగా తెరపైకి వస్తున్నారు. కానీ చంద్రబాబును విమర్శించడం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నారు. వీరి మాటల్లో ఎంత స్పష్టమైన తేడా వచ్చిందంటే.. చంద్రబాబు ఐదేళ్లలో రాజధాని నిర్మింలేకపోయారని.. తామిచ్చిన ఏడున్నర వేల కోట్లు ఏం చేశారో చెప్పాలని వాదించే ఈ ముగ్గురూ.. ఇప్పుడు.. చంద్రబాబు దార్శనికులు.. అమరావతికి ఓ రూపం తెచ్చారని అంటున్నారు.

చంద్రబాబుపై బీజేపీ నేతల్లో పాత అభిమానం !

ఏపీ నేతల్లో మారిన వాయిస్‌కు తోడు.. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కూడా స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్‌లో మోదీ, అమిత్ షాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటారు. పాత బీజేపీ నేతలు చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాయి. వాజ్ పేయి కాలంలో కీలక పాత్ర పోషించిన వారికి చంద్రబాబు .. బీజేపీకి చేసిన మేలేంటో తెలుసు. అందుకే వారు చంద్రబాబుపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు. కానీ మోదీ, షాలు ఇటీవలి కాలంలో వరకూ చూపించలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు నాటి పరిస్థితుల్ని వారు అవసరం కోసం అయినా మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ విషయం స్పష్టమైంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా మోదీతో భేటీ అయితే సీన్ మొత్తం మారిపోతుంది.

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టకపోవచ్చు !

ఇప్పటి వరకూ ఢిల్లీలో జగన్ బలం చంద్రబాబే. చంద్రబాబును ఏపీలో రాజకీయంగా బలపడితే.. బీజేపీకి..మోదీకి వ్యతిరేకంగా బలమైన శక్తి ఏర్పడుతందని.. అలా కాకుండా ఉండాలంటే.. తమకే మద్దతివ్వాలన్న ఓ అప్రకటిత ఒత్తిడి వైసీపీ వైపు నుంచి బీజేపీ మీద ఉంది. విపక్షాలను కూడగట్టగలగిన రాజకీయ చాతుర్యం చంద్రబాబుకు ఉంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనల ద్వారా వచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుని తానిక.. ఢిల్లీ రాజకీయాల వైపు చూడనని చెప్పి ఉంటారని భావిస్తున్నారు. అంటే.. వైసీపీకి ప్రధానమైన అస్త్రాన్ని ఆయన దూరం చేసి ఉంటారని అంచనా.

బీజేపీ మిత్రుడు కాకపోయినా పర్వాలేదు.. శత్రువు మాత్రం కాకూడదు !

బీజేపీ మిత్రుడవకపోయినా పర్వాలేదు.. శత్రువు కాకుండా ఉంటే చాలనేది టీడీపీ, చంద్రబాబు భావన. న్యూట్రల్‌గా ఉండేలా ఉంటే చాలని.. తమ పని తము చేసుకుపోతామని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. బిల్ గేట్స్ లాంటి దిగ్గజాన్ని చంద్రబాబు ఐదు నిమిషాల భేటీలో మనసు మార్చుకునేలా చేశారు. అలాంటిది.. రాజకీయంగా మోదీ మనసులో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేయడంలో విఫలమవుతారని రాజకీయవర్గాలు అనుకోవడం లేదు. ఎందుకే ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పు కనిపిస్తోందని చెప్పక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close