షర్మిల గజ్వేల్ వెళ్లినా బీఆర్ఎస్‌కు భయమేనా ?

చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఓ రాజకీయ కార్యక్రమం పెట్టుకున్నారు. గజ్వేల్ వెళ్లి దళిత బంధు రాలేదని చేసిన కొంత మంది ఫిర్యాదుల మేరకు వారిని పరామర్శించాలనుకున్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. షర్మిల వెళ్తే ఏంటి.. వెళ్లకపోతే ఏంటి అనుకున్నారు. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం అలా అనుకోలేదు. ఆమె బయలుదేరే సమయానికి లోటస్ పాండ్‌లో మోహరించారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాజకీయం గురించి కాస్త ఆసక్తి ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. షర్మిలను కూడా హౌస్ అరెస్ట్ చేసేంత రాజకీయం ఏముందబ్బా అనుకున్నారు. బీఆర్ఎస్ షర్మిల పర్యటకు భయపడుతుందా లేకపోతే.. షర్మిలకు లేనిపోని ప్రయారిటీ ఇవ్వడానికి ఈ పని చేశారా అని చర్చలు ప్రారంభించారు. ఇలాంటి అడ్డుకోవడం అనే సన్నివేశాల్లో ఎలా రాజకీయ మైలేజీ తెచ్చుకోవాలో షర్మిలకు బాగా తెలుసు. దానికి తగ్గట్లుగా ఆమె పర్‌ఫార్మెన్స్ చేశారు. పోలీసులకు హారతి ఇవ్వడం లాంటివి చేశారు. చివరికి ఇంట్లోనే దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు . షర్మిల రాజకీయ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయో లేదో స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ నేతలెవరూ.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు . కానీ షర్మిల మాత్రం.. తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు. కాంగ్రెస్ మత్రం.. ఏపీలో అయితే వెంటనే పీసీసీ చీఫ్‌ను చేస్తామని చెబుతున్నారు. షర్మిల ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close