తెలుగువారున్న ప్రాంతాల్లో భాజ‌పా ఓడింది..!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగువారి ఓట్లు కీల‌క‌మౌతాయ‌న్న అంచ‌నాలు మొద‌ట్నుంచీ ఉన్నాయి. ముప్ఫై నుంచి న‌ల‌భై నియోజ‌క వ‌ర్గాల్లో అక్క‌డ స్థిర‌ప‌డ్డ తెలుగువారి ప్ర‌భావం ఉంటుంద‌న్న ఆందోళ‌న భాజ‌పాకి మొద‌ట్నుంచే ఉన్నదే. ఎందుకంటే, ఏపీ విషయంలో భాజ‌పా అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రికి నిర‌స‌న‌గా అక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేక ఓటేస్తారేమో అనే ఆందోళ‌న ఆ పార్టీలో ముందే నెల‌కొంది. అందుకే, తెలుగువారి ప్ర‌భావ‌మున్న ప్రాంతాల్లో ర‌క‌ర‌కాల వ్యూహాల‌ను అమ‌లు చేశారు. ప్రజల్లో విభ‌జ‌న తీసుకొచ్చేందుకు ఎత్తులూ పైఎత్తులూ వేశారు. ఇంత జ‌రిగాక, నేటి అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలుగువారి ప్ర‌భావం చూప‌గ‌లిగారా అంటే… అవున‌నే చెప్పాలి. భాజ‌పాను నిలువ‌రించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం కొంతైనా ఫ‌లించిందా అంటే.. దానికీ అవున‌నే అనొచ్చు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా భాజ‌పా ఎదిగింది. 104 స్థానాల్లో విజ‌యం సాధించింది. కానీ, సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ ను సింగిల్ గా అందుకోలేక‌పోయింది. తెలుగు ప్ర‌జ‌లు కీల‌కం అనుకున్న రెండు జోన్ల‌లోనూ భాజ‌పాకి మ‌రికొన్ని సీట్లు అదనంగా వచ్చి ఉంటే, సొంతంగా అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఉండేది. హైద‌రాబాద్-క‌ర్ణాట‌క రీజియ‌న్ లో చూసుకుంటే… భాజ‌పాకి 15 సీట్లొచ్చాయి. కాంగ్రెస్ కి 21, జేడీఎస్ కి 4 ద‌క్కాయి. తెలుగువారు అత్యధికంగా బెంగ‌ళూరు సిటీ, రూర‌ల్ ప్రాంతాల్లో కూడా భాజ‌పాకి గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. ఈ ప్రాంతంలో మొత్తం 34 స్థానాల‌కిగాను, 11 మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది.

తెలుగు ప్ర‌జ‌లు కీల‌కం అనుకున్న ప్రాంతాల్లో భాజ‌పాకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింద‌నేది వాస్త‌వం. కానీ, ఈ వాస్త‌వాన్ని భాజ‌పా ఒప్పుకోదు క‌దా! అయినాస‌రే, ఈ ప్రాంతాల్లో గ‌తంతో పోల్చితే ఎక్కువ స్థానాలే దక్కించుకున్నామ‌నీ, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 6 నుంచి 15 సీట్ల‌కు ఎదిగామ‌ని రామ్ మాధ‌వ్ అంటున్నారు. గ‌తం లెక్క వేరు, ఇప్ప‌టి లెక్క వేరు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంశం చర్చనీయం కాలేదు. కానీ, ఇప్పటి ఎన్నికల్లో అక్కడ ఏపీ అంశం కూడా ప్రచారంలో భాగమైంది. నేటి ఫలితాల్లో మ‌రో ప‌ది సీట్లు అద‌నంగా వ‌చ్చి ఉంటే సింగిల్ గానే భాజ‌పా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకోగ‌లిగేది క‌దా. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా… తెలుగువారు నివ‌సించిన ప్రాంతాల్లో భాజ‌పాకి ఎదురుగాలి బాగానే వీచింది. ఏపీ విష‌యంలో కేంద్రం మొండి వైఖ‌రి అవ‌లంభించ‌కుండా ఉంటే… ఈ ప్రాంతాల్లో భాజ‌పాకి మ‌రిన్ని సీట్లు వచ్చేవి అనేది వాస్త‌వం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close