నేడే తాత్కాలిక సచివాలయం ప్రారంభం.. ముఖ్యమంత్రి లేకుండా!

వెలగపూడిలో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం బుదవారం మద్యాహ్నం 2.59 గంటలకి జరుగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్ ప్రారంభించనున్నారు. వైద్య ఆరోగ్య, కార్మిక, పంచాయితీరాజ్, గృహ నిర్మాణ శాఖల కార్యాలయాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి బస్సులలో వేలగాపూడికి చేరుకొన్నారు. జూన్ 27 నుంచే తాత్కాలిక సచివాలయం ప్రారంభించాలని భావించారు కానీ పనులు పూర్తికాకపోవడంతో ఒకరోజు ఆలశ్యంగా ఇవ్వాళ్ళ ప్రారంభిస్తున్నారు. జూలై మొదటి వారం నుంచి ఈ శాఖలన్నీ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆగస్ట్ మొదటి వారం నాటికి మొత్తం అన్ని శాఖల ఉద్యోగులు ఈ తాత్కాలిక సచివాలయం నుంచే పనిచేయడం ప్రారంభిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు చెపుతున్నారు.

తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించి, ముందు అనుకొన్నట్లుగానే జూన్ 27కే ఉద్యోగులు, అధికారులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రప్పించగలిగారు. ఇటువంటి ముఖ్యమైన సమయంలో అయన చైనా పర్యటన పెట్టుకోవడం విచిత్రంగానే ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలెవరినీ కూడా ఆహ్వానించకపోవడం సమంజసంగా లేదు. అమరావతి ప్రజారాజధాని అని చెపుతున్నప్పుడు అందరినీ కలుపుకొనిపోతే వారికి తాము కూడా దానిలో భాగస్వాములమే..అమరావతి మన అందరిదీ అనే భావన కలుగుతుంది. అలాకాక ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వమే చేసుకుపోతుంటే, అమరావతికి సంబంధించినది ఏదైనా అది ప్రభుత్వ వ్యవహారమనే అందరూ భావిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close