గుడ్ న్యూస్‌: ఏపీలో థియేట‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

చిత్ర‌సీమ‌కు, సినీ అభిమానుల‌కు ఇది శుభ‌వార్తే. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం థియేట‌ర్ల రీ ఓపెన్‌కి అనుమ‌తి ఇచ్చింది. లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని స‌డ‌లిస్తూ.. కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో.. థియేట‌ర్లు తెర‌చుకోవ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేసింది. జులై 8 నుంచి ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. తెలంగాణ‌లో ఇప్ప‌టికే థియేట‌ర్లు తెర‌చుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం చెప్పేసింది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవొచ్చు. ఏపీలో మాత్రం 50 శాత‌మే. కాబ‌ట్టి.. చిన్న సినిమాల విడుద‌ల‌కు మార్గం సుగ‌మం అయిన‌ట్టే. ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి ఏపీ, తెలంగాణ‌ల‌లో థియేట‌ర్లు మూత‌బ‌డ్డాయి. అప్ప‌టి నుంచీ కొత్త సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేక‌పోయాయి. చాలా చిత్రాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌ల‌లో థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు వ‌చ్చాయి కాబ‌ట్టి, చిన్న సినిమాలు విడుద‌ల‌కు రెడీ కావొచ్చు. ఏపీలోనూ 100 శాతం సిట్టింగ్ కి అనుమ‌తి ఇస్తే.. పెద్ద సినిమాలూ వ‌స్తాయి.

* టికెట్ రేట్లు ఎలా?

వ‌కీల్ సాబ్ కి ముందు.. ఏపీలో టికెట్ రేట్లు త‌గ్గిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. అది ప‌రోక్షంగా వ‌కీల్ సాబ్ వ‌సూళ్ల‌ని దెబ్బ‌కొట్ట‌డానికే అని.. అప్ప‌ట్లో ప‌వ‌న్ అభిమానులు మండి ప‌డ్డారు. అయితే ఇప్పుడూ అవే రేట్లు కొన‌సాగితే పెద్ద సినిమాల‌కు న‌ష్ట‌మే. ఏపీలోటికెట్ రేట్లు పెంచుకోవ‌డానికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్మాత‌లు కోరుతున్నారు. టికెట్ రేట్ల‌పై ఓ నిర్ణ‌యం ప్ర‌క‌టించేవ‌ర‌కూ పెద్ద సినిమాలేవీ బ‌య‌ట‌కు రావు. కాక‌పోతే మీడియం, చిన్న సినిమాల‌కు మాత్రం ఇదో మంచి అవ‌కాశం. ఆగ‌స్టు నుంచి.. టాలీవుడ్ లో కొత్త సినిమాల హ‌వా మొద‌లు కానుంది. ఈలోగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం టికెట్ రేట్ల‌పై ఓ నిర్ణ‌యానికి వ‌స్తే బాగుంటుంద‌ని టాలీవుడ్ కోరుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close