జగన్, వి.సా.రెడ్డి విదేశీ టూర్స్ – సీబీఐ వ్యతిరేకిచినా కోర్టు అనుమతి !

సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వారి విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని .. సాక్షులను బెదిరిస్తారని అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిద్దరికీ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. సీఎం జగన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు. అక్కడ ఆయన కుమార్తెలు చదువుతున్నారని చెబుతున్నారు. అయితే గతంలో ఓ కుమార్తె ఫ్రాన్స్ కాలేజీలో చేరినట్లుగా ప్రచారం జరిగింది.

విజయసాయిరెడ్డి మరీ విచిత్రమైన కారణాలతో.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా ఓ నెల రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తానని దరఖాస్తు చేసుకున్నారు. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈయన విదేశీ పర్యటననూ సీబీఐ వ్యతిరేకిచింది. అయినా సీబీఐ వాదన లెక్కలోకి రాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు.

బెయిల్ షరతుల్లో పాస్ పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలని.. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వారిద్దరి పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకుంటూ ఉంటారు. ఎన్నికలకు ముంద వీరిద్దరూ విదేశీ పర్యటనలు పెట్టుకోవడంతో సహజంగానే విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close