బాలీవుడ్‌లో మూడు బంపర్‌ ఆఫర్స్‌ కొట్టేసిన తాప్సీ!

మోహన్‌బాబు, మనోజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో 20కి పైగా చిత్రాల్లో నటించిన తాప్సీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అనుకున్నంత పేరు రాలేదు. కొన్ని సినిమాల్లో తన అందాలను ఆరబోయాలని ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే హిందీలో మాత్రం హీరోయిన్‌గా మంచి పేరే తెచ్చుకుంది. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘బేబి’ చిత్రంలో ఆమె పెర్‌ఫార్మెన్స్‌కి మంచి అప్రిషియేషన్‌ వచ్చింది. ఇప్పుడు ఆమెకు అమితాబ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఈ ఆఫర్‌ తనకు రావడం చాలా హ్యాపీగా వుందని తెగ ఆనందపడిపోతోంది తాప్సీ.

అంతేకాకుండా ‘బేబీ’ తర్వాత మళ్ళీ అక్షయ్‌కుమార్‌తో జత కట్టే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన ‘కత్తి’ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో రీమేక్‌ చేసే ఆలోచనలో వున్నాడు ఓ నిర్మాత. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, తాప్సీ హీరోహీరోయిన్లుగా ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఓకే అవ్వలేదని చెప్తోంది తాప్సీ. అలాగే తాప్సీ నటిస్తున్న మరో భారీ చిత్రం ‘ఆగ్రా కా దాబ్రా’. బెంగాలీ దర్శకుడు అనిరుధ్‌ రాయ్‌ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సుజిత్‌ సర్కార్‌ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. ఈ విధంగా హీరోయిన్‌ తాప్సీ బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close