‘హ‌నుమాన్’ .. ఆ చివ‌రి 20 నిమిషాలూ…!

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో చిన్న సినిమా.. ‘హ‌నుమాన్‌’. మూడు పెద్ద సినిమాల మ‌ధ్య న‌లిగిపోతోంది అని అంద‌రి ద‌గ్గ‌రా సానుభూతి సంపాదించుకొంది. కానీ.. ‘హ‌నుమాన్‌’ ప‌రిస్థితి అలా లేదు. ఆ సినిమాకి వ‌చ్చిన క్రేజ్ చూస్తే ఔరా అనిపిస్తోంది. 12న ‘హ‌నుమాన్’ విడుద‌ల అవుతోంటే.. 11నే ప్రీమియ‌ర్లు వేస్తున్నారు. అది కూడా రాత్రి ఏడు గంట‌ల‌కే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 150 థియేట‌ర్ల‌లో హ‌నుమాన్ ప్రీమియ‌ర్లు ప‌డ‌బోతున్నాయి. దాదాపు అన్ని థియేట‌ర్లూ హౌస్ ఫుల్స్‌. ఓ చిన్న సినిమాకి ఈ స్థాయిలో ప్రీమియ‌ర్లు ప‌డ‌డం, ఆ టికెట్లు ముందే హాట్ కేకుల్లా అమ్ముడుపోవ‌డం ‘హ‌నుమాన్’ క్రేజ్‌కి నిద‌ర్శ‌నం. ఈమ‌ధ్య పెయిడ్ ప్రీమియ‌ర్ల హ‌వా ఎక్కువ న‌డుస్తున్న మాట నిజం. అయితే ఏ సినిమాకీ ఇన్ని థియేట‌ర్ల‌లో ప్రీమియ‌ర్లు ప‌డ‌లేదు. తేజా స‌జ్జా… అనే ఓ కుర్ర హీరో సినిమాకి ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బ‌జ్ రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

కంటెంట్ ప‌రంగా ‘హ‌నుమాన్’ స్ట్రాంగ్ గా ఉన్న‌ట్టు సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది. ముఖ్యంగా చివ‌రి 20 నిమిషాలు వేరే స్థాయిలో ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఈ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర ఎవ‌రు చేశారు? అనే ప్ర‌శ్న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. చిత్ర‌బృందం ఈ విష‌యంలో గోప్యం పాటిస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో హ‌నుమంతుడ్ని రివీల్ చేసే సీన్‌.. ఈ సినిమా మొత్తానికి హైలెట్ కానుంద‌ని టాక్‌. బాలీవుడ్ లో ఇప్ప‌టికే ఈ సినిమాని కొంద‌రు ప్ర‌ముఖుల‌కు చూపించారు. వాళ్లు కూడా విజువ‌ల్స్ చూసి ఫిదా అయ్యార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close