విత‌ర‌ణ‌ల ప‌ర్వం.. టాలీవుడ్ రియ‌ల్ హీరోయిజం

మ‌న హీరోలు.. రీల్ హీరోలు మాత్ర‌మే కాదు. రియ‌ల్ హీరోలు కూడా. తెర‌పై సందేశాలు దంచి కొట్ట‌డ‌మే కాదు, అవ‌స‌రం అయిన‌ప్పుడు సందేహం లేకుండా సాయం అందించ‌డానికి సిద్ధంగా ఉంటారు కూడా. తెలుగు ప్ర‌జ‌ల్ని ప్ర‌కృతి వైప‌రిత్యాలు క‌బ‌లించిన‌ప్పుడు, `నేనున్నా` అంటూ ఆదుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఓ మ‌నిషి.. మ‌రోమ‌నిషికి సాయం అందించాల్సివ‌చ్చిన‌ప్పుడు కూడా అంతే గొప్ప‌గా స్పందిస్తున్నారు. ఎవ‌రికి తోచినంత వాళ్లు స‌హాయం చేస్తున్నారు. కోట్లు ధార‌బోస్తున్నారు. నితిన్ రూ.20 ల‌క్ష‌ల‌తో ఈ సాయానికి శ్రీ‌కారం చుడితే ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.2 కోట్ల‌తో దాన్ని తారాస్థానికి తీసుకెళ్లాడు. రామ్ చ‌ర‌ణ్ 70 ల‌క్ష‌లు ప్ర‌క‌టించి త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. ఇప్పుడు మిగిలిన‌వాళ్లంతా మెల్ల‌మెల్ల‌గా ముందుకొస్తున్నారు. చిరంజీవి నుంచి కోటి రూపాయ‌ల సాయం అందితే, ప్ర‌భాస్ మ‌రో కోటి ఇచ్చి ఈ విష‌యంలోనూ తాను `బాహుబ‌లి`నే అని నిరూపించుకున్నాడు. మ‌హేష్ కూడా కోటి రూపాయ‌లు అందించ‌నున్నాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ రూ.10 ల‌క్ష‌లు, అల్ల‌రి న‌రేష్ రూ.10 ల‌క్ష‌లు, స‌తీష్ వేగేశ్న రూ.10 ల‌క్ష‌లు, అనిల్ రావిపూడి రూ.10 లక్ష‌లు, కొర‌టాల శివ 10 ల‌క్ష‌లు, దిల్‌రాజు రూ.20 ల‌క్ష‌లు, త్రివిక్ర‌మ్ రూ.20 ల‌క్ష‌లు, స‌హాయం ప్ర‌క‌టించారు.

మ‌రి హీరోయిన్ల మాటేమిటి?

టాలీవుడ్‌లో చెప్పుకోవ‌డానికి చాలామంది హీరోయిన్లున్నారు. తెలుగు చిత్ర‌సీమ మా పుట్టినిల్లు.. అని గ‌ర్వంగా చెబుతుంటారు. కానీ ఇలాంటి స‌మ‌యంలో మాత్రం ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ముందుకొచ్చి స‌హాయం చేసిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఈసారీ అంతే. క‌రోనా వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ ట్వీట్లు చేశారు గానీ, ఏ ఒక్క‌రూ ఆర్థిక స‌హాయం మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. కొంత‌మంది ఇంట్లో కూర్చుని వంటా వార్పూ చేసుకుంటుంటే, ఇంకొంత‌మంది మంది వ్యాయామాలతో కాల‌క్షేపం చేస్తున్నారు. ఆ వీడియోల్ని ఫేస్ బుక్‌లోనూ, ట్విట్ట‌ర్ల‌లోనూ పోస్ట్ చేసి లైకులు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇదేనా స‌మాజ సేవ అంటే..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close