సాగర్ జలాలలో సరిహద్దు సమస్యలా?

ఏపి, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుండి రెండు రాష్ట్రాల మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు ఒకసారి నాగార్జున సాగర్ గేట్లు తెరిచే విషయంలో రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ అటువంటి పరిణామాలే ఏర్పడ్డాయి. ఈసారి గేట్ల విషయంలో కాక ఆంధ్రా పరిధిలో ఉన్న సాగర్ జలాలలో తెలంగాణా బోట్లు నడపడంపై వివాదం మొదలయింది. తెలంగాణా పర్యాటక శాఖ సిబ్బంది ఏపీ భూభాగంలో ఉన్న అనుపు అనే ప్రాంతంలో విహార యాత్రికులను తిప్పే బోట్లను నడిపేందుకు వచ్చినప్పుడు వారిని ఏపీ పర్యాటక శాఖ సిబ్బంది అడ్డుకొన్నారు. ఆంద్రప్రదేశ్ పరిధిలో ఉన్న జలాలలో తెలంగాణా బోట్లు ఏవిధంగా నడుపుతారని ప్రశ్నించడంతో ఇరు రాష్ట్రాల సిబ్బంది మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. ఆ సంగతి తెలిసి ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ చాలా ఉద్రిక్తంగా ఉంది.

నదీ జలాలు పంపకంలో రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయంటే అర్ధం ఉంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ వాటా దక్కితే వారు ఎక్కువ లబ్ది పొందుతారు. కానీ ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు విహార యాత్రికుల బోట్లు నడిపించుకొనేందుకు శత్రుదేశాలవలె పోరాడుకోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఈ సమస్య ఆంధ్రా-తెలంగాణా సరిహద్దు సమస్యలాగ పైకి కనబడుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాజకేయ ప్రయోజనాల కోసం ఏదో ఒక సమస్యతో పదేపదే ప్రజలను రెచ్చగొడుతున్నందున ప్రజల మధ్య కూడా నానాటికి దూరం పెరుగుతోంది. ఇంతవరకు కలిసిమెలిసి జీవించిన ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకొంటున్నారు.

అధికార పార్టీలు తమ మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని ప్రభుత్వాల వరకు పాకించడమే ఒక పెద్ద తప్పు మళ్ళీ దానిని ప్రజలలోకి కూడా వ్యాపింపజేయడం ఇంకా పెద్ద తప్పు. ప్రజల మధ్య మళ్ళీ సహృద్భావ వాతావరణం నెలకొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారి మధ్య ఇంకా దూరం పెంచుతున్నాయి. ప్రజల మధ్య పెరుగుతున్న ఆ అకారణ ద్వేషం కారణంగానే ఇటువంటి చిన్న చిన్న సమస్యలకు కూడా అతిగా స్పందిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఏవిధంగా ప్రవర్తించినప్పటికీ ప్రజలందరూ తాము ఒకే తెలుగు జాతికి చెందినవారిమనే సంగతి మరిచిపోకూడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close