తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రస్థానం, దాని వెనుక ఉన్న సమీకరణాల గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నటి త్రిష పేరు ఈ రాజకీయ చదరంగంలో అనూహ్యంగా తెరపైకి రావడం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది. విజయ్ రాజకీయ నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం తమిళ మీడియాలో జోరుగా సాగుతోంది.
అమిత్ షాతో భేటీ.. విజయ్‌కు ఊరట?
ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే, ఈ విచారణకు ముందు త్రిష ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రహస్యంగా సమావేశమయ్యారని, ఆ తర్వాతే విజయ్‌కు విచారణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేఫ్ పాసేజ్ లభించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకేతో రాయబారాలు?
మరోవైపు, అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి కుమారుడితో కూడా త్రిష చర్చలు జరుపుతున్నారనే వార్తలు తమిళ రాజకీయ ఇన్నర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పొత్తులు , వ్యూహాత్మక మద్దతు కోసం ఆమె మధ్యవర్తిత్వం వహిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ పార్టీకి మైలేజ్ పెంచే క్రమంలో త్రిష తనకున్న పరిచయాలను వాడుతున్నారనేది ఈ ప్రచారం సారాంశం.
త్రిష ఖండించినా ఆగని ప్రచారాలు
ఇటీవల బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సమయంలో ఆమె ఘాటుగా స్పందించారు. తన పేరును అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని .. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ, తర్వాత పరిణామాల్లో విజయ్ తో కలిసి కనిపించడం.. విజయ్‌తో ఉన్న సుదీర్ఘ స్నేహం, విజయకు భార్యతో విడాకులు రాగానే పెళ్లి కూడా చేసుకుంటారన్న ప్రచారంతో.. త్రిష పేరు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.


