ప‌వ‌న్ వాళ్ల అన్న‌య్య‌కే చెప్ప‌డు.. ఇక నాకేం చెబుతాడు? – త్రివిక్ర‌మ్‌తో ఇంట‌ర్వ్యూ

త్రివిక్ర‌మ్ నిజంగా మాంత్రికుడే.
త‌నేదో మాయ చేస్తాడు. మాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని, త‌న క‌థ‌ల‌తో హీరోల్ని త‌న బుట్ట‌లో వేసేసుకుంటాడు.
అందుకే అజ్ఞాత‌వాసి లాంటి ఫ్లాప్ త‌ర‌వాత కూడా త్రివిక్ర‌మ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే అటెన్ష‌న్ తెచ్చేసుకుంటాం.
త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌డానికి… మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయ‌డానికి హీరోలంతా ఎదురుచూస్తుంటారు.
అదే మ‌రి త్రివిక్ర‌మ్ మ్యాజిక్ అంటే. `అర‌వింద స‌మేత‌` గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద్భంగా త్రివిక్ర‌మ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో పెద్ద‌గా మాట్లాడ‌లేదు… కార‌ణాలేమైనా ఉన్నాయా?

ప్ర‌త్యేకించి ఏం లేవు. ఆ స‌మ‌యంలో ఏం మాట్లాడినా టాపిక్ మ‌రింత భార‌మైపోతుంద‌నిపించింది. అప్ప‌టికే ఆక్క‌డ మూడ్ అంతా గంభీరంగా మారిపోయింది. అందుకే మాట్లాడ‌లేక‌పోయాను.

ఎన్టీఆర్ అంత విషాదంలో ఉన్న‌ప్పుడు `షూటింగ్‌కి రాగ‌ల‌రా` అని అడ‌గడానికి ధైర్యం కావాలి క‌దా?

అందుకే అడ‌గ‌లేదండీ. కానీ రెండో రోజు సాయింత్రం ఫోన్ చేసి `రేపు షూటింగ్‌కి వ‌స్తున్నా.. అన్నీ రెడీ చేసుకోండి` అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. నిజానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనుకున్న స‌మ‌యానికి ఈ సినిమాని తీసుకొస్తామా లేదా? అనే టెన్ష‌న్ ఏమీ ప‌డ‌లేదు. అక్టోబ‌రు 11ని మైండ్‌లోంచి తీసేశాం. అయితే ఫిబ్ర‌వ‌రి, లేదంటే స‌మ్మ‌ర్‌కి ఈసినిమా తీసుకొద్దామ‌నుకున్నాం. ఎన్టీఆర్ ధైర్యంగా ఆ స్టెప్ తీసుకోవ‌డం వ‌ల్లే.. ఇప్పుడు విడుద‌ల చేసే అవ‌కాశం ద‌క్కింది.

రం.. రుధిరం… అనే పాట హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర‌వాతే తీశార్ట క‌దా..?

అదే దుర‌దృష్టం. మేం చేయాల్సిన షాట్లు అవే మిగిలాయి. అంత విషాదంలోనూ ఎన్టీఆర్ ఆ స‌న్నివేశాల్ని చేసేశారు.
ఈ నెల రోజులూ త్రివిక్ర‌మ్ చాలా ధైర్యం ఇచ్చారు అని ఎన్టీఆర్ అన్నారు. అది ఆయ‌న గొప్ప‌ద‌నం. నిజానికి మా అంద‌రికీ ధైర్యం చెప్పింది ఎన్టీఆరే.

ఎన్టీఆర్‌తో ప‌న్నేండేళ్ల అనుబంధం.. మ‌రి సినిమా చేయ‌డానికి ఇంత కాలం ప‌ట్టిందెందుకు?

అనుకున్నాం గానీ కుద‌ర‌లేదు. నాన్న‌కు ప్రేమ‌తో స‌మ‌యంలో మాత్రం ఈసారి గ‌ట్టిగా అనుకున్నాం. ఈసారి చేయాల్సిందే అని. మూడు క‌థ‌లు డిస్క‌ర్ష‌న్ చేశాం. అందులో `అర‌వింద స‌మేత‌` బాగా న‌చ్చింది.

ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో చాలా సినిమ‌లొచ్చాయి. ఐదారేళ్ల నుంచి అస‌లు ఆ జోన‌రే ముట్టుకోవ‌డం లేదు. కానీ మ‌ళ్లీ మీరు ఆ ధైర్యం చేశారెందుకు?

ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు నేనూ చూశాను. అందులో చాలా హిట్స్ ఉన్నాయి కూడా. అయితే హింస‌, హీరోయిజం… ఇవ‌న్నీ మ‌న‌కు బాగా కిక్ ఇచ్చాయి. ఆ త‌ర‌వాత ప‌రిస్థితేంట‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేదు. మ‌హాభార‌తంలో కూడా యుద్దాల గురించి చెప్పి, త‌ర‌వాత విష‌యాలు పెద్ద‌గా చ‌ర్చించ‌డానికి ఒప్పుకోరు. దానికి గ‌ల కార‌ణం.. అవేం పెద్ద‌గా కిక్ ఇవ్వ‌వు. యువ‌త‌రానికి జీవితం ప‌ట్ల ఉన్న ఆశ‌ని అవ‌న్నీ చంపేస్తాయి. ఫ్యాక్ష‌న్ క‌థ‌లూ అంతే. ఫ్యాక్ష‌న్ వ‌ల్ల చితికి పోయిన జీవితాల గురించి, మాంగ‌ళ్యం పోగొట్టుకున్న భార్య‌ల గురించీ మాట్లాడుకోరు. వాటిని ఈ సినిమాలో చూపిస్తున్నాం. నిజానికి ఈ పాయింటే.. ఎన్టీఆర్‌కి బాగా న‌చ్చింది.

ఎన్టీఆర్ చేసిన గ‌త చిత్రాల‌కూ ఈ సినిమాలో అత‌ని న‌ట‌న‌కు ఉన్న తేడా ఏమిటి?

గ‌త సినిమాల్లో క‌నిపించ‌ని కోణం ఇందులో ఉంటుంది. అత‌ని బ‌లాల్ని వాడుకుంటూనే, పాత చిత్రాల ఛాయ‌లు క‌నిపించ‌కుండా చూడ‌డానికే ప్ర‌య‌త్నిస్తా. అయితే పెద్ద పెద్ద మార్పులు కూడా అవ‌స‌రం లేదండీ. అభిమానుల‌కు రిజిస్ట‌ర్ అయ్యేలా చిన్న మార్పులు చూపించినా.. అవి బాగా పండుతాయి.

సునీల్‌ని మీరే పిలిచారా, త‌ను వ‌చ్చాడా?

సునీల్‌కో క్యారెక్ట‌ర్ ఇవ్వాల‌ని రెండేళ్ల నుంచీ అనుకుంటున్నా. అది ఇప్పుడు కుదిరింది. నేను కూడా త‌న‌కు `ముందు హీరోగా నువ్వు చేస్తున్న సినిమాల్ని పూర్తి చేసుకుని రా` అని చెప్పా. త‌ను కూడా కొత్త‌వి ఒప్పుకోకుండా అలా ఉండిపోయాడు.

ముందు అనిరుధ్‌ని అనుకున్నారు క‌దా, త‌న‌ని ప‌క్క‌న పెట్ట‌డానికి కార‌ణం?

త‌న‌కు తెలుగు సినిమా సంగీతం అర్థం కావ‌డానికి, నాకు అనిరుధ్ అర్థం కావ‌డానికి కొంత స‌మయం ప‌డుతుంద‌నిపించింది. `ఈ సినిమాకి వ‌ద్దులే… `అనుకుని త‌మ‌న్‌ని తీసుకున్నా. అనిరుధ్ నాకు చాలా ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు. త‌న‌తో త‌ప్ప‌కుండా ప‌నిచేస్తా.

దేవిని ఎందుకు పక్క‌న పెట్టిన‌ట్టు?

ప‌క్క‌న పెట్ట‌లేదండీ. ఇప్ప‌టికీ మేం ట‌చ్‌లో ఉంటాం. నాకు నేను కొత్త‌గా క‌నుక్కునే ప్ర‌యాణంలో మిగిలిన వాళ్ల‌తో జ‌ర్నీ చేస్తుంటా. అంతే త‌ప్ప‌.. ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏం రాలేదు.

మిమ్మ‌ల్ని మాట‌ల మాంత్రికుడు అంటుంటారు. అది కిరీటం అనుకుంటారా? ముళ్ల కిరీటంలా భావిస్తారా?

ఏమీ అనుకోను. స్టేజీపైకి న‌న్ను పిల‌వ‌డానికి యాంక‌ర్లు నాలుగైదు ర‌కాలుగా అభివ‌ర్ణిస్తూ పొగుడుతూ పిలుస్తుంటారు. అవేం మొద‌లెట్ట‌కుండా స్టేజీపైకి వెళ్లిపోవాల‌నిపిస్తుంది.

అజ్ఞాత‌వాసి ఎఫెక్ట్ ఎంత ప‌డింది? ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అనే క‌సిని పెంచిందా?

ఆ క‌సి ఎప్పుడూ ఉంటుందండీ. ఈ సినిమాకీ అలానే అనుకున్నా. కానీ ప‌నిలో ప‌డిన త‌ర‌వాత‌.. అవేం ప‌ట్టించుకోలేదు. ఓ మంచి సీన్ వ‌చ్చినప్పుడు, ఓమంచి డైలాగ్ రాసిన‌ప్పుడు మంచి కిక్ వ‌స్తుంది. నాకు అది చాలు.

అజ్ఞాత‌వాసి డిస్ట్ర‌బ్ చేయ‌లేదు అని చెప్ప‌ను. కానీ కొంత సేపే.

మీ స్నేహితుడు ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు… `ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది క‌దా` అని స‌ల‌హాలేం ఇవ్వ‌లేదా?

స‌ల‌హాలా.. భ‌లేవారండీ. స‌ల‌హాలు ఇచ్చేంత సీన్ ఉందా?

పోనీ రాజ‌కీయాల్లోకి వెళ్తున్న‌ప్పుడు మీకేమైనా చెప్పారా?

నాకెందుకు చెబుతారు. ఆయ‌న త‌న అన్న‌య్య‌కే ఏం చెప్ప‌డు?? స్నేహితుడిగా ఆయ‌న‌తో ఇప్ప‌టికీ ట‌చ్‌లో ఉన్నాను.

ఆయ‌న రాజ‌కీయ ప్ర‌సంగాల‌న్నీ మీరు రాసిచ్చిన‌వే అంటారు?

నా స్క్రిప్టులు నేను రాసుకోవ‌డానికే బ‌ద్దకం ఎక్కువ‌. ఇక రాజ‌కీయ ప్ర‌సంగాలేం రాస్తాను. నాకూ రాజ‌కీయాల‌కూ బాగా దూరం. పేప‌ర్లు చ‌ద‌వ‌ను. టీవీలు చూడ‌ను. ఇక రాజ‌కీయాలేం తెలుస్తాయి?

ఈమ‌ధ్య మీకు న‌చ్చిన సినిమాలేంటి?

అర్జున్ రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100, రంగ‌స్థ‌లం, గూఢ‌చారి, పెళ్లిచూపులు, కేరాఫ్ కంచ‌ర‌పాలెం.. ఇలా చాలా సినిమాలున్నాయి.

త‌ర‌వాత బ‌న్నీతోనేనా?

ఇంకా డిసైడ్ అవ్వ‌లేదు.. చూద్దాం. ఏం జ‌రుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close