తెరాస రాజ్య సభ : ఒక ఓసీ, ఒక బీసీ…

TRS elected oc and bc candidates for Rajya Sabha
TRS elected oc and bc candidates for Rajya Sabha

గులాబీ పార్టీ పెద్దల సభ అభ్యర్థుల ఖరారు ఇదిపార్టీని నమ్ముకొని తనతో కలిసి వచ్చిన కెప్టెన్ కు రాజ్యసభ వరించబోతోంది. కేసీఆర్ కు మొదట్నుంచి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వస్తున్న లక్ష్మీకాంతరావు పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి దక్కనున్న రెండు రాజ్యసభ సీట్ల విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఒకటి తన వెన్నంటే ఉన్న నేతకు, తనను నమ్ముకొని 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కీలకంగా మసలిన డీఎస్ కు పదవులు కట్టబెట్టారు. ఇక లక్ష్మీకాంతరావు నేపథ్యం చూస్తే ఆయన ఆర్మీలో కెప్టన్ స్థాయికి ఎదిగారు. ఆర్మీలోనూ తనకంటూ గుర్తింపు పొందారు. పీవీ నరసింహారావుకు కెప్టెన్ స్వయంగా బంధువు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. కేసీఆర్, కెప్టెన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాల కూడా ఉన్నాయ్. కేసీఆర్ లో 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు ఫౌండర్ మెంబర్ గా లక్ష్మీకాంతరావు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా వ్యవహరించి… కేసీఆర్ తో అనేక ఆటుపోట్లను చూశాడు. కేసీఆర్ నిరాహారదీక్ష చేసినప్పుడు ఖమ్మం జైలు వద్ద మకాం పెట్టాడు. కేసీఆర్ వరంగల్ వస్తే ఇక కెప్టెన్ ఇంట్లోనే బస చేస్తారు. వరంగల్ జిల్లాలో కెప్టెన్ నివాసం… సీఎం కేసీఆర్ అనధికారికం క్యాంప్ కార్యాలయంగా స్థానికులు పిలుచుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. పార్టీలో పనుల కోసం, ప్రభుత్వ పనుల కోసం వచ్చే సందర్శకులతో లక్ష్మీకాంతరావు ఇల్లు సందడిసందడిగా ఉంటుంది. ఇప్పటికే కెప్టెన్ కుటుంబం నుంచి భార్య హుజురాబాద్ మండలాధ్యక్షురాలిగా కొనసాకగుతుండగా… తనయుడు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా కెప్టన్ కూడా ఎంపీగా కాబోతున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. నాడు వైఎస్ కేబినెట్లో మంత్రిగానూ స్వల్పకాలం పనిచేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి కేసీఆర్ కు నమ్మినబంటుగా మారాడు. విద్యా సంస్థల నిర్వాహణలో లక్ష్మీకాంతరావుది అందివేసిన చేయి. ఆయన విద్యా సంస్థలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో బాగా పాపులర్ అయ్యాయి. సీటు కోసం రికమండేషన్ల వరకు ఉందంటే స్టాండర్స్ ఎలా మెయింటేన్ చేస్తారో ఊహించుకోవచ్చు.

ఆయన రాజకీయంగా ఉత్థనాపతనాలు చూశాడు. రాజకీయంగా తనకు తిరుగులేదనుకున్న టైమ్ లో బొక్క బొర్లా పడ్డాడు. తెలంగాణ గురించి ఎక్కువ కొట్లాడనని ఆయన చెప్పుకున్నా… ఆయన తెలంగాణ గురించి ఏవిధంగా పోరాడాడో అందరికీ తెలుసు. సమయానికి తగు విధంగా రూటు మార్చడం డీఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో బీసీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ మున్నూరుకాపు నేత కేసీఆర్ తో ఉన్న సాన్నిహత్యం టీఆర్ఎస్ లో అగ్రస్థానాన కూర్చోబెట్టింది. నిజామాబామాద్ జిల్లాలో తన రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడంతోపాటు, ఏపీ పాలిటిక్స్ లోనూ డీఎస్ కు విలక్షణ గుర్తింపు ఉంది.

2004లో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తూ, వైఎస్ తో కలిసి పనిచేశారు. పార్టీని అధికారంలోకి తేవడంలో తనదైన ముద్ర వేశాడన్న అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు కలిగించడంలో సఫలమయ్యాడు. 2009లోనూ పీసీసీ చీఫ్ గా పార్టీగా ఉండి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయ్. వైఎస్ తర్వాత తనే నెంబర్ 2 అనుకుటుంన్న తరుణంలో బీజేపీపై నిజామాబాద్ లో డీఎస్ ఓడిపోయారు. తర్వాత రాజకీయంగా డీఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. హైకమాండ్ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ కోసం ఢిల్లీలో సోనియా తదితర పెద్దలతో మాట్లాడుతూ… కేసీఆర్ తో సంప్రదింపుల విషయంలో డీఎస్ కీలక పాత్ర పోషించారన్న అభిప్రాయం ఉంది. అయితే తర్వాత అదే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే ప్రభుత్వ సలహాదారు పోస్టు దక్కించుకున్న డీఎస్ కు ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏకాకిగా ఉన్న ధర్మపురి… తర్వాత పార్టీ ఫిరాయించి తనకు కావాల్సిన పదవిని సొంతం చేసుకున్నాడు. ఇక డీఎస్ కు రాజ్యసభ కేటాయింపు విషయంలో కేసీఆర్ కుమార్తె కవిత పంతం కూడా ఉపయోగపడింది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి తిరుగులేకుండా ఉండాలంటే డీఎస్ లాంటి సీనియర్ మద్దతు తనకు అవసరమని ఆమె కేసీఆర్ కు తెగేసి చెప్పారు. కుమార్తె… పైపెచ్చు పార్టీ రెండూ ఆలోచించిన కేసీఆర్ ఇప్పటికే మున్నూరుకాపుకు చెందిన నేత కె.కేశవరావుకు రాజ్యసభ ఇచ్చినా డీఎస్ ను పెద్దల సభకు పంపడానికి నిర్ణయించారు. డీఎస్ కుటుంబసభ్యులకు రాజకీయంగా పెద్దగా అచ్చిరాకపోయినా… ఆయన పార్టీకి ఏవిధంగా ఉపయోగపడతాడో కాలమే సమాధానం చెప్పాలి మరీ…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com