” కేటీఆర్ సీఎం ” డిమాండ్ పెంచుతూ పోతున్న టీఆర్ఎస్ నేతలు..!

ఓ ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా.. మరొకరు సీఎం అవ్వాలన్న అభిప్రాయం … అధికార పార్టీలో వినిపించడం అంటే… అది అసంతృప్తి అయినా అయి ఉండాలి లేదా.. వ్యూహాత్మకం అయినా అయి ఉండాలి. ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ లాంటి పార్టీల్లో అసంతృప్తి అనేదానికి చోటు ఉండదు. ఇక వ్యూహాత్మకమే అనుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఈ వ్యూహాత్మక… అధికార మార్పిడి చర్చ జోరుగా సాగుతోంది. ప్రణాళిక ప్రకారం అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు… కేసీఆర్ ఇక దిగిపోవాలని.. కేటీఆర్‌కు పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను వినిపించడం ప్రారంభించారు. రాను రాను ఈ వాయిసే పెరుగుతూండటంతో… హైకమాండ్ నుంచి వస్తున్న సూచనల మేరకే ఇలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది.

కొద్ది రోజుల కిందట… టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్…కేటీఆర్ మూడు నెలల్లో సీఎం అవుతారని ప్రకటించారు. కేసీఆర్ అలసిపోయారన్నట్లుగా ఆయన మాట్లాడి కేటీఆర్‌కు బాధ్యతలివ్వాలన్నారు. నిజానికి ఇది పార్టీ లైన్ కు విరుద్ధంగా ఉంటే.. అప్పుడే .. ఆయనతో పాటు అందరికీ సంకేతాలు వెళ్లేవి.. ఇంకెవరూ… సీఎం పదవి గురించి మాట్లాడవద్దని. కానీ.. ఎలాంటి సంకేతాలు వెళ్లలేదు. అంటే.. హైకమాండ్ ఆలోచనల మేరకే.. రెడ్యానాయక్ అలా మాట్లాడారని టీఆర్ఎస్‌ వారికీ క్లారిటీ వచ్చింది. తాజాగా… మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. కేటీఆర్ డైనమిక్ అని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి పొందడానికి ఇదే సరైన సమయం అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సీఎం అనే డిమాండ్లు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. తర్వాత ర్యాలీలు జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంచనా వేయవచ్చు. కేసీఆర్ వ్యూహం ప్రకారం.. కేటీఆర్ సీఎం అనే డిమాండ్ ను.. పీక్స్‌కు తీసుకెళ్లి.. ఆ తర్వాత తాను చేయాలనుకున్నది చేస్తారన్న అభిప్రాయం మాత్రం.. ఇతర పార్టీల్లో ఉంది. ఇందు కోసం మూడు నెలలు పట్టవచ్చని… టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అన్నిపార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close