ఓట్ల తొల‌గింపు వ‌ల్ల తెరాస‌కు న‌ష్టం జ‌రిగింద‌న్న కేసీఆర్‌!

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగింపున‌కు వ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రిని క‌లిశారుగానీ, మాయావ‌తీ అఖిలేష్ యాద‌వ్ ల‌ను క‌ల‌వ‌లేదు. జాతీయ రాజ‌కీయాల్లో మూడో ప్ర‌త్యామ్నాయం ఏర్పాటులో భాగంగా క‌ల‌వాల‌ని భావించారు. అఖిలేష్ యాద‌వ్ స్వ‌యంగా తెలంగాణ వ‌చ్చి, కేసీఆర్ ను క‌లుస్తా అంటూ స్ప‌ష్టం చేశారు. మాయావ‌తితో భేటీపై గురువారం రాత్రి వ‌ర‌కూ స్ప‌ష్టమైన స‌మాచారం అంద‌లేదు. అయితే, ఢిల్లీలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఓట‌ర్ల జాబితాకు సంబంధించి ఆయ‌న మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు నుంచీ ఓట‌ర్ల జాబితాల‌పై చాలా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మౌతూ వ‌చ్చాయి. చాలామంది పేర్ల‌ను త‌లొగించాలంటూ వాద‌న‌లు వినిపించాయి. చివ‌రికి ఎన్నిక‌ల త‌రువాత ఈసీ కూడా ఈ విష‌య‌మై ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. త్వ‌ర‌లో రాబోతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి ఓట‌ర్ల జాబితాలోని అవ‌క‌త‌వ‌క‌ల్ని స‌రిచేయాలంటూ సునీల్ అరోరాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరారు. ఓట్ల తొల‌గింపు వ‌ల్ల తెరాస బాగా న‌ష్ట‌పోయింద‌నే అభిప్రాయం కేసీఆర్ వ్య‌క్తం చేయ‌డం విశేషం. త‌మ పార్టీ తెరాస గుర్తు కారు ఉంటే… దాదాపు దాన్ని పోలిన‌ట్టుగా ఉన్న ఇత‌ర వాహ‌నాల‌ను కొంత‌మందికి కేటాయించ‌డం ద్వారా, ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి గుర‌య్యార‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. కాబ‌ట్టి, కారును పోలి ఉన్న ఇత‌ర గుర్తుల్ని తొల‌గించాలంటూ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను కోరారు. ఓట‌రు జాబితాపై వెంట‌నే రివ్యూ చేసి, తొల‌గించిన ఓట్ల విష‌య‌మై చ‌ర్య‌లు ప్రారంభించాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన పార్టీ కూడా ఓట‌ర్ల జాబితా వ‌ల్ల‌నే న‌ష్ట‌పోయామంటూ వాద‌న వినిపించ‌డం విశేషం! ఇక‌, భాజ‌పా కూడా ఇదే వాద‌న‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు వినిపించింది. తెలంగాణ‌లో పెద్ద మొత్తంలో అర్హుల ఓట్ల‌ను తొల‌గించ‌డం వ‌ల్ల త‌మ పార్టీ న‌ష్ట‌పోయిందంటూ ఈ ప్రాంత నేత‌లు కూడా ఈసీని క‌ల‌వ‌డం మ‌రో విశేషం. ఇక‌, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నిక‌ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు అంటూ ఎన్నిక‌ల ముందు నుంచీ ఏకంగా న్యాయ పోరాట‌మే చేసింది. జాబితా స‌వ‌రించే వ‌ర‌కూ ఎన్నిక‌ల్ని వాయిదా వేయాలంటూ పోరాడింది. తెలంగాణ‌లో ప్ర‌ముఖ పార్టీల‌న్నీ ఓట‌ర్ల జాబితాలోని అవ‌క‌త‌వ‌క‌ల వ‌ల్ల‌నే న‌ష్ట‌పోయామంటూ మాట్లాడుతూ ఉండ‌టం విచిత్రం…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close