విజయమ్మ లేఖ పై తులసి రెడ్డి కౌంటర్

తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ జైత్రయాత్ర సభలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పరిష్కరించి లేకపోయిన విషయాన్ని లేవనెత్తడం వైఎస్ఆర్సిపి పార్టీకి గట్టిగానే గుచ్చుకున్నట్లు ఉంది. కీలకమైన ఉప ఎన్నిక సమయంలో ఈ ప్రచారం ఏ విధంగా కొంప ముంచుతుందో అన్న ఉద్దేశంతో అప్రమత్తం అయిన వై ఎస్ ఆర్ సి పి, సీఎం తల్లి విజయమ్మ పేరిట బహిరంగ లేఖను విడుదల చేసింది. అయితే ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలపై పలువురు కౌంటర్లు వేస్తున్నారు. ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఈ లేఖలో ఉన్న అసంబద్ధత పై కౌంటర్ వేశారు. వివరాల్లోకి వెళితే..

లేఖలో వైయస్ విజయమ్మ, రాజశేఖర్ రెడ్డి గారి మృతి పై కూడా తమకు అనుమానాలున్నాయని, కానీ ఆ కేసును కూడా తాము పరిష్కరించుకో లేక పోయాం అని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై తులసిరెడ్డి మాట్లాడుతూ, జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తులు, సాక్షి మీడియా వేదికగా గతంలో రాజశేఖర్ రెడ్డి హత్య లో రిలయన్స్ పాత్ర, ముఖేష్ అంబానీ పాత్ర ఉందని బలమైన ఆరోపణలు చేశారని, కానీ అదే ముఖేష్ అంబానీ వస్తే ఆయన కోసం, ముఖ్యమంత్రి హోదాలో జగన్ , రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడమే కాకుండా, ఆయన కోరిన పరిమళ కు వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ టిక్కెట్ కేటాయించారని గుర్తు చేశారు. దీన్ని బట్టి అంబానీ పై అప్పట్లో జగన్ అండ్ కో చేసిన ఆరోపణలు అయినా అబద్ధం అయి ఉండాలి లేదా అంబానీ డబ్బులకు జగన్ అమ్ముడుపోయి అయినా ఉండాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అదేవిధంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం సిబీఐ పరిధిలో ఉందని చెబుతున్న విజయమ్మ, జగన్ అండ్ కో, ఈ కేసు సిబిఐ కి అప్పగించడానికి ముందు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తొమ్మిది నెలల వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈ కేసు ఉండేదని, దాదాపు మూడు సిట్ లు వేసిన జగన్ ప్రభుత్వం ఎందుకని మూడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లు వేసి కూడా కేసును పరిష్కరించలేక పోయిందని ప్రశ్నించారు. బంధువులు అయిన వ్యక్తులే వైయస్ వివేకానంద రెడ్డిని చంపారని తెలిసి జగన్ ప్రభుత్వం హంతకులను కాపాడుతోంది అన్న ఆరోపణలపై ఈ ప్రభుత్వం ఏమి చెబుతుంది అని ఆయన ప్రశ్నించారు. ఇక కోడి కత్తి కేసు కూడా ఒక డ్రామా అని, అందుకే ఆ కేసును జగన్ ప్రభుత్వం ముందుకు సాగనీయడం లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజశేఖర్ రెడ్డి కొడుకు అన్న ఉద్దేశంతోనే ప్రజలు జగన్ ను గెలిపించారని, కానీ తన తండ్రి మరణం పై అనుమానాలు ఉన్నాయని గతంలో చెప్పిన జగన్ కు ఇప్పుడు తండ్రి కూడా పట్టడం లేదని, చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య ను కూడా ఆయన పట్టించుకోవడం లేదని, ఆయనకు కేవలం అధికారం అధికారం అధికారం తప్ప ఇంకేమీ అక్కర్లేదు అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

వైయస్ విజయమ్మ పేరిట విడుదల అయిన లేఖ పై ప్రజల్లో కూడా చాలావరకు సందేహాలు ఉన్నాయి. పార్టీ పెట్టబోతోంది అన్న వార్తలు వచ్చిన కొత్తలో షర్మిల పేరిట సాక్షి లో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖను షర్మిల నిజంగా ఆ రాయలేదని సాక్షి యాజమాన్యమే సృష్టించిందని ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా విజయమ్మ రాసిన లేఖ పలు అంశాలకి సమాధానాన్ని ఇవ్వలేక పోయింది అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఈ కేసు ఎందుకని పరిష్కారం కావడం లేదు అన్న అంశాలను లేఖలో ప్రస్తావించ లేక పోయారు అని, సిబిఐ కి ఈ కేసును అప్పగించడానికి ముందు దాదాపు 9 నెలల పాటు ఈ కేసును హ్యాండిల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఎందుకు పురోగతి సాధించలేక పోయింది అని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. వీటిలో వేటికీ విజయమ్మ లేఖ లో సమాధానాలు లేకపోవడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close