ఎన్టీఆర్‌లో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు

రోజురోజుకీ `స్టార్ల‌`తో బ‌లం పుంజుకొంటోంది `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌. విద్యాబాల‌న్ కి బ‌స‌వ‌తార‌కం పాత్ర అప్ప‌గించే స‌రికి… ఈ సినిమాకి బాలీవుడ్ క‌ల‌రింగొచ్చింది. రానా తోడ‌వ్వ‌డంతో ఇంకా బ‌లం పుంచుకుంది. ఓప్ర‌ధాన పాత్ర‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకోవ‌డంతో కొత్త గ్లామ‌రొచ్చింది. కీర్తీ సురేష్ సావిత్రిగా క‌నిపించ‌నున్న‌ద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కూ ఛాన్సుంద‌ని తెలుస్తోంది. జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద పాత్ర‌ల కోసం ఇద్ద‌రు నాయిక‌ల పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని, అందుకోసం యువ హీరోయిన్ల‌ను తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. వీరిద్ద‌రూ క‌నిపించేది కాసేపే. కాక‌పోతే.. ఓ కీల‌క‌మైన స‌న్నివేశంలో జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌ల ప్ర‌స్తావ‌న రానుంది. అందుకే.. పేరున్న క‌థానాయిక‌ల‌నే తెర‌పై చూపించాల‌ని క్రిష్ భావిస్తున్నాడు. బ‌హుశా.. ఇద్ద‌రివీ ఒక రోజు కాల్షీట్లే. కాబ‌ట్టి… అతిథి పాత్ర‌ల‌ని స‌రిపెట్టుకోవొచ్చు. వీళ్లే కాకుండా ఇంకా కొంత‌మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. వాళ్లంద‌రినీ ఒకే సారి తెర‌పై చూస్తే… అంత‌కంటే సంద‌డి ఏముంది..???

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close