అఖిల్‌కి ఇక లైన్ క్లియ‌ర్‌

అఖిల్ త‌న రెండో సినిమా విష‌యంలో పిచ్చ పిచ్చ‌గా ఆలోచించేస్తున్నాడు.చాలామంది ద‌ర్శ‌కుల్ని పిలిపించుకొని క‌థ‌లు విన్నాడు. ఆఖరికి వంశీపైడిప‌ల్లినీ లైన్‌లో పెట్టాడు. కానీ.. ఏదో ఓ మూల అనుమానం. వంశీ యాక్ష‌న్ డ్రామాల్ని బాగా తీయ‌గ‌ల‌డు. అఖిల్‌తో తాను చేసింది అదే. ఏజ్ చిన్న‌ది.. బిల్డ‌ప్ పెద్ద‌ది అనిపించింది. వంశీని ఎంచుకొని మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నానా అనే భావ‌న వెంటాడింది. పైగా వంశీ త‌న సినిమాల్ని బాగా లేట్ చేస్తాడు. అందుకే వంశీ పైడిప‌ల్లి విష‌యాన్ని పెండింగ్‌లో పెట్టాడు.

ఇప్పుడు ఊపిరి విడుద‌లైంది. అన్నిచోట్లా.. అందిరినోటా సూప‌ర్ హిట్ టాక్ అందుకొంటోంది. అందుకే… అఖిల్‌కీ ఓ ధీమా వ‌చ్చేసింది. హిట్ సినిమా ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డిపోతే.. బండి సేఫ్ అనే అభిప్రాయానికి వ‌చ్చేసుంటాడు. నాగ్ కూడా.. అఖిల్‌ని వంశీ చేతిలో పెట్ట‌డానికి ఏమాత్రం ఆలోచించ‌డేమో. అందుకే అఖిల్‌కి లైన్ క్లియ‌ర్ అయిపోయింది. పైగా అఖిల్ చేతిలో ఉన్న‌ది ఓ రీమేక్ క‌థ అని తెలుస్తోంది. ఇన్‌ట‌చ్‌బుల్స్ ని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్టుగా మ‌ల‌చిన వంశీ.. ఈ రీమేక్‌కీ న్యాయం చేస్తాడ‌న్న న‌మ్మ‌కం అఖిల్‌కి క‌లిగి ఉండొచ్చు. అతి త్వ‌ర‌లోనే అఖిల్ – వంశీల సినిమా న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డొద్దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close