సోషల్ మీడియా ను కట్టడి చేయాలంటూ సోషల్ మీడియా లోనే మెసేజ్ పెట్టిన విజయశాంతి

సోషల్ మీడియా ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వంటి కంపెనీలు బాహాటంగానే , కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాను రాజకీయ కారణాలతోనే కేంద్రం కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అంటూ మరొక వర్గం వ్యాఖ్యానించడం ఒకవైపు జరుగుతుంటే, సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవమైన వార్తల ప్రచారం వల్ల అనేక విధాలుగా సమాజానికి చేటు జరుగుతోందని కొంతవరకు హింసకు కూడా కారణమవుతున్నాయని మరొక వర్గం వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీలో చేరిన విజయశాంతి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ను కట్టడి చేయాలన్న కేంద్ర నిర్ణయం సరైనదే అంటూ ఆవిడ వాదించారు. వివరాల్లోకి వెళితే..

విజయశాంతి మొదట్లో బిజెపి పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత బిజెపికి రాజీనామా చేసి తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసి కెసిఆర్ చెల్లెలిని అంటూ టిఆర్ఎస్ పార్టీలో కొంతకాలం హవా కొనసాగించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ నుండి మళ్ళీ తిరిగి బిజెపికి చేరారు. అయితే ప్రస్తుతానికి బిజెపి లో ఉండడం వల్లో లేదంటే, నిజంగానే సోషల్ మీడియా ను కట్టడి చేయాలన్న ఉద్దేశం తనకు ఉన్నందువల్లో తెలియదు కానీ సోషల్ మీడియా ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆవిడ బలంగా సమర్థిస్తున్నారు. ఆవిడ ట్వీట్ చేస్తూ..

“సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో పోస్టులు పెట్టడం…. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం…. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే కేంద్రం సోషల్ మీడియా కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు పెట్టడం జరిగిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు. మన దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించడం, వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగల్చడం, అత్యాచారాలు వంటి పలు రకాల నేరాలను ప్రేరేపించే ఏవైనా సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ అయినపుడు, వాటిని ముందుగా పోస్ట్ చేసినవారి వివరాలు చెప్పాలని, శాంతిభద్రతలను దెబ్బతీసే పోస్ట్‌ల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని కొత్త డిజిటల్ రూల్స్‌లో ఉందని మంత్రి విపులంగా చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని విమర్శిస్తున్నవారికి ఇదే సోషల్ మీడియా కంపెనీలపై మన పొరుగుదేశం చైనా ఏ విధంగా ఉక్కుపాదం మోపిందో… తన స్వంత సోషల్ మీడియా సైట్లను మాత్రమే ఉపయోగించేలా ఆ ప్రభుత్వం ఎలా కట్టడి చేసిందో తెలియదా? దీని గురించి ఒక్కరూ మాట్లాడరు. భావప్రకటన స్వేచ్ఛ మన దేశంలో ఉన్నంతగా మరెక్కడా లేదన్నది నిర్వివాదాంశం. దేశ భద్రత విషయంలో కూడా రాజీ పడేలా కొన్ని వర్గాలు వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. నేను గతంలో ఎన్నోసార్లు ఈ మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని తెలియజేశాను. సరైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.” అని రాసుకొచ్చారు.

అయితే విజయశాంతి ట్వీట్ లకు కూడా నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. సోషల్ మీడియా పై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ సమంజసమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, ఇంకొందరు ఇటీవల బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ను సరిగా కట్టడి చేస్తే హింస జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం సోషల్ మీడియాను కట్టడి చేయాలని విజయశాంతి సోషల్ మీడియా లోనే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. నిజంగా సోషల్ మీడియాను కట్టడి చేస్తే, భవిష్యత్తులో ఎప్పుడైనా విజయశాంతి ఉన్న పార్టీ అధికారంలోకి లేనప్పుడు ఆవిడ చేసే వ్యాఖ్యలు కూడా అదే విధంగా సెన్సారింగ్ కు లోను అవుతాయని, అప్పుడు తన వ్యాఖ్యలు కూడా ప్రజలను చేరకపోవచ్చు అని మరి కొందరు వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా సోషల్ మీడియాను కట్టడి చేయాలని విజయశాంతి అదే సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించడం చర్చకు దారితీస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close