విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌లో చిరు?

చిరంజీవి జోరు మామూలుగా లేదు. సినిమాల మీద సినిమాలు ఓకే చేస్తున్నాడు. కొత్త వాళ్ల‌కి అవ‌కాశాలు ఇస్తున్నాడు. ఒక‌ట్రెండు హిట్లు కొట్టిన వాళ్లకూ… త‌లుపులు తెరిచే ఉంచుతున్నాడు చిరు. తాజాగా… చిరు కోసం ఓ కొత్త క‌థ త‌యారైంది. ఈసారి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ క‌థ‌ని అందించార‌న్న‌ది ఇన్ సైడ్ టాక్‌.

బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్ జాన్… ప్ర‌స్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రాల ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి చిరంజీవి అంటే.. వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆయ‌న ఎప్ప‌టి నుంచో చిరుతో క‌ల‌సి ప‌ని చేయాల‌నుకుంటున్నార్ట‌. ఇటీవ‌ల విజ‌యేంద్ర ప్ర‌సాద్ చిరంజీవి మ‌ధ్య భేటీ జ‌రిగింది. ఇద్ద‌రూ క‌థ గురించి చర్చించుకున్నార‌ని తెలుస్తోంది. చిరుకి స‌రిప‌డ క‌థ‌.. విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాశార‌ని, అందుకోస‌మే ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల‌.. చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ కొన్ని కామెంట్లు చేశారు. “టాలీవుడ్ లో ఒక‌టి, రెండు, మూడు స్థానాలు చిరంజీవివే. అన్ని రికార్డులూ ఆయ‌న పేరు మీద ఉండాలి. త్వ‌ర‌లో ఆయ‌న సినిమా పాత రికార్డుల‌న్నీ చెరిపేసే స్థాయిలో ఆడాలి. అందుకోసం నా వంతు ప్ర‌య‌త్నం నేను చేస్తా“ అన్నారు. ఈ కామెంట్లు సైతం.. చిరు కోసం ఆయ‌న క‌థ సిద్ధం చేశార‌న్న విష‌యాన్ని బ‌లప‌రుస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close