‘ఆహా’లో విశ్వక్ సేన్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ‘దాస్ కా ధమ్కీ’… ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్

‘ఆహా’ 100% తెలుగు లోక‌ల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌. ఇప్ప‌టికే ఎన్నో సూప‌ర్ డూపర్ హిట్ చిత్రాల‌ను, ఒరిజిన‌ల్స్‌ను, టాక్ షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మ‌రో సూప‌ర్ హిట్ మూవీ చేసింది. అదే ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల్టీ టాలెంటెడ్ విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో హీరోగా న‌టించారు. వైవిధ్య‌మైన కథాంశాల‌తో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో విశ్వ‌క్ సేన్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరోగా నటిస్తూనే ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మార్చి 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌, హైప‌ర్ ఆది, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డ‌బ్బు కోసం ఎంత‌టి దారుణానికైనా ఒడిగ‌ట్టే వ్య‌క్తి సంజ‌య్ రుద్ర‌. పుట్టిన త‌ర్వాత అనాథ‌గా మారి చాలా క‌ష్ట‌ప‌డి పెరిగి పెద్దైన మ‌రో వ్య‌క్తి కృష్ణ‌దాస్‌..మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే దాస్ కా ధమ్కీ. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ ఇద్ద‌రూ ఒకేలా ఉండ‌టం. విశ్వ‌క్ సేన్‌, హైప‌ర్ ఆది, మ‌హేష్‌ల న‌ట‌న‌తో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు స‌ర‌దాగా సాగిపోయే ఈ సినిమా ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని ట‌ర్న్ తీసుకుంటుంది. అస‌లు వీరి మ‌ధ్య గొడ‌వేంటి? ధ‌న‌వంతుడు సంఘంలో పేరున్న సంజ‌య్ రుద్ర ఉన్న‌ట్లుండి కృష్ణ‌దాస్‌ను ట్రాప్ చేయాల‌న‌కున్న విష‌యాలు, క‌థ‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్నులు ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. అలాంటి మూమెంట్స్‌తో ఆడియెన్స్‌కి అందించ‌టానికి సిద్ధ‌మైంది ఆహా.

లియోన్ జేమ్స్‌, రామ్ మిర్యాల అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్.. దినేష్ కె.బాబు, జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ ప్రేక్ష‌కుల‌కు మంచి ఫీస్ట్‌ను అందిస్తాయ‌న‌టంలో సందేహం లేదు.

‘ఆహా’లో ఏప్రిల్ 14న ‘దాస్ కా ధ‌మ్కీ’ ప్రీమియ‌ర్ కానుంది. కాబ‌ట్టి మీ క్యాలెండ‌ర్‌లో ఆ డేట్‌ను మార్క్ చేసి పెట్టుకోండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close