రివ్యూ: వ్యూహం (అమెజాన్ వెబ్ సిరీస్‌)

తెలుగులో వెబ్ సిరీస్‌లు జోరందుకున్నాయి. ఈ నెలలో విడుదలైన నాగచైతన్య ‘దూత’ అసలు సిసలైన వెబ్ సిరీస్ గ్రామర్ ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణంలో ఓ వెబ్ సిరిస్ వచ్చింది. అదే ‘వ్యూహం’. ఈ నగరానికి ఏమైయింది ఫేం సాయి సుశాంత్‌, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, ప్రీతి అస్రానీ లాంటి తారాగణం కీలక పాత్రలు పోషించిన ఈ సిరిస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైయింది. మరి ఈ ‘వ్యూహం’ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ని పంచింది? ఇందులోని మలుపులు ప్రేక్షకుల ఆకట్టుకున్నాయా ?

మైకేల్ (చైతన్య కృష్ణ) భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి) గర్భిణి. తనని హాస్పిటల్‌కు తీసుకువెళ్లడానికి క్యాబ్ బుక్ చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. దీంతో బైక్‌పై బయలుదేరతారు. దారిలో మూడు సార్లు వేర్వేరు బైక్‌లు అకస్మాత్తుగా అడ్డు రావడంతో రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. కానీ అనుకోకుండా ఓ కారు ఢీ కొడుతుంది. దాంతో, జెస్సికాకు గర్భస్రావం అవుతుంది. తను గతాన్నీ మర్చిపోతుంది. ఈ ప్రమాదం గురించి మైఖేల్‌ కేసు పెడతాడు. ఆ కేసు ఏసీపీ అర్జున్‌ రామచంద్ర (సాయి సుశాంత్‌ రెడ్డి) వద్దకు వెళ్తుంది. ఈ కేసు విచారణలోకి దిగిన అర్జున్ కు ఇది మామూలు ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసు కాదని, దీని వెనుక పెద్ద నెట్ వర్క్ వుందని అర్ధమౌతుంది. ఈ క్రమంలో ఎలాంటి మలుపు తెరపైకి వచ్చాయి? అసలు అర్జున్‌ రామచంద్ర ఎవరు? తన గతం ఏమిటి? అసలు ఈ యాక్సిడెంట్ వెనక ఉన్న కారణాలేంటి? ఇవన్నీ వెబ్ సిరీస్ లో చూడాలి.

ఎన్నో జీవితాలు, ఎన్నో దారులు, మరెన్నో మలుపులు… అంటూ ఈ వెబ్ సిరీస్ ఆరంభంలో ఓ టైటిల్ కార్డ్ వేశారు. దీనికి తగ్గట్టే ఈ సిరీస్ సాగుతుంది. చివరి సన్నివేశాన్ని తొలి సన్నివేశంగా చూపించడం ఒక స్క్రీన్ ప్లే కిటుకు. ఈ సిరీస్ కూడా రాములు నడుపుతున్న వాహనం యాక్సిడెంట్ తో మొదలౌతుంది. ఆ యాక్సిడెంట్ లో గర్భవతి అయిన రాములు భార్య చనిపోతుంది. ఈ సన్నివేశం తర్వాత మైకేల్ భార్యకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆమె కూడా గర్భావతే కావడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైన ముడి ఉందా అనే ఆసక్తి మొదలౌతుంది. తర్వాత అర్జున్ కథ తెరపైకి వస్తుంది. అర్జున్ అమ్మ వాణి రామచంద్ర. తను కూడా ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి. తనకి కూడా ఒక గతం వుంటుంది. ఇక్కడవరకూ ఈ సిరీస్ సెటప్ ఆసక్తిగానే వుంటుంది.

అయితే రెండో ఎపిసోడ్ కి చేరుకున్న తర్వాత ఇందులో ఉపకథలు, అవసరానికి మించి పాత్రలు, వారి నేపధ్యం.. గందరగోళంగా అనిపిస్తుంది. ఒక కొత్త పాత్రని పరిచయం చేస్తూ వాళ్ళ కథని, నేపధ్యాన్ని చెప్పడానికి పూనుకోవడం సహనానికి పరీక్ష పెడుతుంది. టెర్రరిజం, నక్సలిజం, రౌడీయిజం, మాఫియా, డ్రగ్స్, ఆత్మకథ, కర్మ సిద్ధాంతం.. ఇలా ఏవేవో కోణాలు చెప్పుకుంటూ వెళ్లారు. చాలా పాత్రలు, ఉపకథలు చెప్పేయాల‌న్న‌ ఆలోచన మంచిదే కానీ.. వాటిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారా? కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అయ్యేలా చేస్తున్నామా లేదా? అనేది చెక్ చేసుకుంటే బెటర్ గా వుండేది. ఇందులో చాలా వరకూ పాత్రలు, వాటి ఉపకథలు అయోమయానికి గురి చేస్తాయి తప్పితే థ్రిల్ ని పంచవు.

వెబ్ సిరీస్ చివరికి ఎపిసోడ్ లో కూడా కొత్త పాత్రలు ప్రవేశించడం, అప్పుడే వాళ్ళ కథని ఫ్రెష్‌ గా చెప్పే ధోరణి ఇందులో కనిపిస్తుంది. నిజానికి ఇన్వెస్టగేషన్ థ్రిల్లర్ లో ఒకొక్క ముడి వీడినప్పుడు థ్రిల్ రావాలి. ఇందులో మాత్రం ఆ ముడి ఎక్కడిదనే ఆలోచనలో పడిపోతాడు ప్రేక్షకుడు. కారణం ఉపకథలు ఎక్కువైపోవడమే. కథ, ఉపకథలు ఈ రెండు వేరు వేరు. ఒక కథ ఆసక్తికరంగా చెప్పడానికి ఉపకథ సహకరిస్తుంది తప్పితే.. మూల కథనే ఉపకథలు డామినేట్ చేస్తే అది లక్ష్యం తప్పినట్లే. ఇందులో అదే జరిగింది. అయితే ఈ సిరీస్ లో మెచ్చుకునే అంశాలు కూడా వున్నాయి. ఎక్కడా హింసకు శృతిమించ కుండా రక్తపాతనికీ, అశ్లీలతకు తావు లేకుండా సిరీస్ మలిచారు.

ఏసీపీ అర్జున్‌ రామచంద్ర పాత్రలో సాయి సుశాంత్‌ సీరియస్ గా కనిపించాడు. ఆ పాత్రకు తన ఆహార్యం సరిపోయింది. అయితే చాలా వరకూ ఒకటే మాడ్యులేషన్ లో డైలాగులు చెప్పడం, ఒకటే ఎక్స్ ప్రెషన్ ని కంటిన్యూ చేస్తున్న భావన కలుగుతుంది. ఇందులో తనకో ప్రేమకథ లాంటింది వుంది. కానీ ఈ కథలో అది కుదరలేదు. మైఖేల్‌గా కృష్ణ చైతన్య పర్వాలేదనిపిస్తాడు. పావని, ప్రీతి అస్రానీ పరిధిమేర చేశారు. అక్బర్ పాత్రలో రవీంద్ర విజయ్ మెప్పిస్తాడు. వీరితో పాటు ఇందులో సరిగ్గా రిజిస్టర్ కానీ చాలా పాత్రలు కనిపిస్తాయి.

టెక్నికల్ గా సిరీస్ ఓకే అనిపించినప్పటికీ నిర్మాణంలో పరిమితులు కనిపిస్తాయి. ఒక వెబ్ సిరీస్ కి వరల్డ్ బిల్డింగ్ చాలా ముఖ్యం. ఇందులో అలాంటి జాగ్రఫీ కనిపించదు. కథ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ ఫార్మ్ అవుతుందనేది సహజంగా అనిపించదు. లైటింగ్ కలర్ గ్రేడింగ్ కూడా బేసిక్ గా అనిపిసుంది. కెమెరాపనితనం, నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తాయి. కంటెంట్ పరంగా చూస్తే చాలా అంశాలని ఒకే సీజన్ లో చెప్పేయాలనే ప్రయత్నం కనిపిచింది. ఒక వెబ్ సిరీస్ కి నేపధ్యాలు, ఉపకథలు వుండాలి. కానీ ఈ వెబ్ సిరీస్‌లో ఆ డోసు ఎక్కువైపోయింది. అస‌లు క‌థ‌ని ఉప క‌థ‌లు మింగేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close