చైతన్య : చట్టం అధికారానికి చుట్టం..! జగన్ కేసే సాక్ష్యం..!

లాలూ యాదవ్ కేసులు ఎందుకు పరుగులు పెట్టాయి..? తెల్లవారే సరికి సీఎంగా ప్రమాణం చేయాల్సిన శశికళ… జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..?. ఇరవై ఏళ్ల కిందట.. అక్రమలంటూ.. మాయావతిపై ఇప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు..? అక్రమంగా ఇసుక తవ్వారంటూ.. అఖిలేష్‌పై పదేళ్ల కిందటి కేసులు ఎందుకు బయటకు వస్తున్నాయి..?. రాబర్ట్ వాద్రాకు లండన్‌లో ఆస్తులుంటే ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..? ఇవన్నీ.. సామాన్య జనానికి వచ్చే ప్రశ్నలు. అన్నింటికీ ఒకటే సమాధానం.. వారంతా.. బీజేపీ వ్యతిరేకులు. అందుకే బీజేపీ మిత్రపక్షంగా సీబీఐ వారిని వెంటాడుతోంది.

నిజంగా లూటీ చేసిన జగన్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు..?

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఐదేళ్లయినా.. ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడలేదు. ఈ విషయంపై చాలా మంది చాలా కారణాలు చెబుతారు కానీ.. అసలు విషయం మాత్రం.. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉండటమే. దీనికి మరో సాక్ష్యం బయటపడింది. జగన్‌ కు సంబంధించి ఓ క్విడ్ ప్రో కో లంచానికి సంబంధించి పక్కా ఆధారాలతో.. ఈడీ అధినేత సీబీఐకి లేఖ పంపి..చర్యలు తీసుకోవాలని కోరినా.. ఇంత వరకూ స్పందించలేదు. జగన్‌పై.. బీజేపీ సర్కార్ ఎంత ప్రేమాభిమానం చూపిస్తుందో… సీబీఐ, ఈడీని ఎంతగా కట్టడి చేసిందో… ఓ కొత్త వ్యవహారం బయటకు వచ్చింది. అన్నీ ఆధారాలున్నాయి… ఇక అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరచడమే తరువాయని.. ఈడీ స్పష్టమైన లేఖ రాస్తే..సీబీఐ..దాన్ని కోల్డ్ స్టోరేజీలో పడేసి.. కాన్షీరామ్ విగ్రహాల కేసులు..యూపీలో ఇసుక తవ్వకాల కేసులు చేపడుతోంది.

అన్ని ఆధారాలున్నా ఎందుకు మోడీ మౌనం..?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.. 2017లో… సీబీఐ డైరక్టర్‌గా ఉన్న అలోక్ వర్మకు ఓ లేఖ రాశారు. ఈ అలోక్ వర్మను.. మోడీ గుజరాత్ నుంచి పిలిపించుకుని పదవిలో కూర్చోబెట్టారు. చివరికి ఆయన రివర్స్ అయ్యారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2005లో ఓ దరఖాస్తదు చేస్తున్నారు. 2009లో ఎన్నికలకు వెళ్లే ముందు వైఎస్ వంద ఎకరాలు కేటాయించారు. మిస్టర్ టెన్ పర్సంట్ జగన్‌కు 11.10 ఎకరాలు… బినామీ కంపెనీల ద్వారా .. జగన్మోహన్ రెడ్డికి చేరేలా… క్విడ్ ప్రో కో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం.. హిందూజా కంపెనీ… ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీలకు 46 కోట్ల 40 లక్షలు బదిలీ చేసింది. దీని కోసం ప్రాజెక్టుల పని అని నాలుగు ఇన్వాయిస్‌లు సృష్టించారు. ఈ సొమ్మును… ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ..కోల్‌కతాలోని సూట్‌కేసు కంపెనీలకు పంపింది. ఆ కంపెనీలు… యాగా అసోసియేట్స్ అనే కంపెనీలో ఆ సొమ్ముతోవాటాలు కొనుగోలు చేశాయి. ఈ యాగా అసోసియేట్స్‌కు బోర్డు కూడా లేదు. ఈ యాగా అసోసియేట్స్‌ కంపెనీని విజయసాయిరెడ్డి నిర్వహించారని.. ఈడీ తేల్చింది. బెంగళూరు అడ్రస్‌తో ఈ కంపెనీ వ్యవహారాలను ఈడీ లెక్క తీసింది. ఒక్క లావాదేవీ కూడా లేదు. అయినప్పటికీ..షెల్ కంపెనీల ద్వారా షేర్లను ఒక్కోటి 115 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చూపించారు. ఆ సొమ్ముతో… హిందూజా కంపెనీలకు ఇచ్చిన 11.10 ఎకరాలు..కొనుగోలు చేసినట్లు చూపించారు. ఈ మొత్తం వ్యవహారాలకు.. ఈడీ వద్ద ఆధారాలున్నాయి.

కేసులను నీరుగార్చి ఏం సాధించబోతున్నారు…?

2013లో… సీబీఐ కోర్టులో… సీబీఐ మెమో దాఖలు చేసింది. అసలు క్విడ్ ప్రో కోకు… మూల సంస్థలు అయిన సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, క్లాసిక్ రియాల్టీ, ఆర్ ఆర్ గ్లోబల్, సరస్వతి పవర్, మంత్రి డెవలపర్స్, పీవీపీ వెంచర్స్, జూబ్లీ మీడియా సంస్థలలో క్విడ్ ప్రో కో కు ఆధారాలు లేవని ఆ మెమె సారాంశం. ఈ విషయాన్ని ఈడీ డైరక్టర్ తప్పు పట్టారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే.. ఆయా సంస్థలన్నీ.. క్విడ్ ప్రో కోకు పాల్పడ్డాయని ఈడీ డైరక్టర్ లేఖలో పేర్కొన్నారు. ఐదు చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియా కేసును మూసేయడాన్ని తప్పు పట్టారు. సీబీఐ మెమెను చూపి ఈడీ కేసులను ఓడించడానికి జగన్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని మండి పడ్డారు. సీబీఐ చర్యలు తీసుకోవాలని ఈడీ డైరక్టర్ కోరారు. ఈడీ డైరక్టర్ నుంచి..సీబీఐ డైరక్టర్‌కు ఈ లేఖ చేరి రెండేళ్లయింది. కానీ.. దాన్ని పట్టించుకోలేదు. అప్పటికే.. జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఫ్రెండ్స్ జాబితాలో చేరిపోవడమే దీనికి కారణం అనేది రాజకీయ వర్గాలన్నీ సులువుగా అంచనా వేసే విషయం. మామూలుగా అయితే.. ఇలాంటి కేసులు..స్పష్టమైన ఆధారాలతో… బీజేపీ వ్యతిరేకులపై వస్తే.. వారికి ఈ పాటికి శిక్షలు కూడా ఖరారయ్యేవి. లాలూ ప్రసాద్ యాదవ్ కేసే ఇందుకు ఉదాహరణ.

అసలు అవినీతి జగన్‌ది కాదు.. మోడీది..!

దేశంలో అవినీతిని సహించబోమని..మోడీ, జైట్లీ లాంటి వాళ్లు తెగ వాగేస్తూంటారు. కానీ కళ్ల ముందు అవినీతి చేస్తూ.. తమకు మద్దతిస్తే చాలనుకుంటున్నారని.. తాజా పరిణామాలతో నిరూపితమవుతుంది. ఏపీ ప్రయోజనాలను… మోడీ కాళ్ల దగ్గర పెట్టి.. తమ కేసుల నుంచి బయటపడటానికి ఏం చేయాలా.. అని ఆలోచించే స్వార్థపరులు.. ఏపీకి ఉన్నారు. వారి ప్రయోజనాల కోసమే వారు రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఉపయోగించుకుని మోడీ లాంటి వాళ్లు రాజకీయం చేస్తారు. కానీ బయటకు చెప్పడానికి మాత్రం… మాటలు చెబుతున్నారు. ఇది ఓ రకంగా.. మోడీ చేస్తున్న భయంకరమైన అవినీతి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close