ఉత్త‌మ్ ఇలాఖాలో కోదండ‌రామ్ పోటీకి దిగుతారా..?

తెలంగాణ జ‌న స‌మితి… ప్ర‌స్తుతం వార్త‌ల్లో కూడా వినిపించ‌డం లేదు! గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీడీపీల‌తో క‌లిసి కూట‌మిలో భాగంగా పోటీ కోదండ‌రామ్ పార్టీ బ‌రిలోకి దిగింది. కేవ‌లం నాలుగు సీట్ల‌లో మాత్ర‌మే పోటీ చేసినా, ఒక్క‌టి కూడా గెలుచుకోలేక‌పోయారు. వాస్త‌వానికి, పార్టీని మ‌రింత ప‌టిష్ట ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాతి నుంచి జ‌న స‌మితి పార్టీ కార్య‌కలాపాలేవీ పెద్ద‌గా లేవు. కానీ, ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాము పోరాటం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామ‌ని కోదండ‌రామ్ అంటున్నారు. ప్ర‌స్తుతం హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే, అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు. దీంతో అక్క‌డ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవుతోంది. కాబ‌ట్టి, అక్క‌డి నుంచి కోదండ‌రామ్ బ‌రిలోకి దిగితే ఎలా ఉంటుంద‌నే ప్ర‌తిపాద‌న తెర‌మీదికి తెచ్చిన‌ట్టు స‌మాచారం.

హుజూర్ న‌గ‌ర్ నుంచి పోటీకి దిగాలంటూ సొంత పార్టీకి చెందిన‌వారే కోదండ‌రామ్ పై ఒత్తిడి తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో, అక్క‌డ ఎన్నిక‌ల‌కు దిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుందా అనే అంశంపై స‌న్నిహితులతో కోదండ‌రామ్ చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. హుజూర్ న‌గ‌ర్ లో పోటీకి దిగితే… తెలంగాణ వ్యాప్తంగా ఒక్క‌సారిగా జ‌న‌స‌మితి పార్టీపై అటెన్ష‌న్ వ‌స్తుంద‌నీ, అక్క‌డ ఎమ్మెల్యేగా గెలిస్తే… పార్టీకి కొత్త ఉత్సాహం రావ‌డం ఖాయ‌మ‌నీ, పార్టీ విస్త‌ర‌ణ‌కూ ప‌నికొస్తుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో అభిప్రాయంగా తెలుస్తోంది.

అయితే, ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అనేది మ‌ర‌చిపోకూడ‌దు! ఉత్త‌మ్ సొంత ఇలాఖా. ఆయ‌న లేక‌పోతే ఆ కుటుంబానికి చెందిన‌వారిని నిలబెట్టుకుంటారు. అంతేగానీ, దీన్ని కోదండ‌రామ్ కోసం త్యాగం చేస్తారా..? హ‌జూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక మీద తెరాస కూడా చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఉత్త‌మ్ సొంత నియోజ‌క వ‌ర్గంలో గులాబీ జెండా ఎగ‌రేయ‌డానికి స‌ర్వ‌శ‌క్తులూ మోహ‌రించి మ‌రీ ఉప ఎన్నిక‌ను ఎదుర్కొంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో… కోదండ‌రామ్ పోటీకి దిగ‌డం సాధ్య‌మా అనేది ప్ర‌శ్న‌? ఒక‌వేళ కాంగ్రెస్ తో పొత్తును కాద‌నుకుని… తెరాస వెర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య జ‌రిగే ఉప పోరులో కోదండ‌రామ్ సొంతంగా నిల‌బడ్డా కూడా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి స‌మ‌యంలో పోటీ గురించి ఆలోచించే కంటే… మ‌రో నాలుగేళ్ల విజ‌న్ తో పార్టీ నిర్మాణంపై దృష్టిపెడ‌తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close