వైసీపీ రాజీనామాల ఆమోదం..! ఇదో బ్రహ్మపదార్థం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు… కొద్ది రోజులుగా తమ రాజీనామాలపై చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇదిగో …మా రాజీనామాలను ఆమోదిస్తున్నారు.. అదిగో మా రాజీనామాలను ఆమోదిస్తున్నారు అంటూ.. ఢిల్లీలో దాదాపుగా ప్రతి రోజూ హడావుడి చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతకూ ఈ రాజీనామాల ఆమోదం సీరియల్ తెగడం లేదు. ఎప్పటికప్పుడు క్లైమాక్స్ జరుగుతున్నట్లే ఉంటుంది. కానీ రోజులకురోజులు గడిచిపోతూనే ఉన్నాయి. రాజీనామాలను చేసినట్లు మరోసారి ధృవీకరణ పత్రాలివ్వమని స్పీకర్ వైసీపీ ఎంపీలను అడిగారు. వారు ఇచ్చారు కూడా..! అయినా సుమిత్రా మహాజన్.. వాటిని ఆమోదించడానికి సమయం చిక్కడం లేదు. బుధవారం, గురువారం రెండు రోజులూ ఆమె కార్యాలనికి వచ్చారు. కానీ.. నిర్ణయం మాత్రం తీసుకోలేదు.

స్పీకర్ సుమిత్రా మహాజన్ నేటి నుంచి పది రోజుల పాటు విదేశీ యాత్రకు వెళ్తున్నారు. పార్లమెంటరీ బృందంతో కలిసి లాత్వియా, బెలారస్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన హడావుడిలో ఆమె ఉన్నారు. ఒక వేళ ఏ నిర్ణయం తీసుకోకుండా.. ఆమె విదేశీ పర్యటనకు వెళితే మాత్రం… మరో పది రోజుల వరకు ఆమోదం పొందే అవకాశాలు లేనట్లే. అసలు ఎందుకు వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ పెండింగ్‌లో పెడుతున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆమోదం పొందాయని చెప్పుకోడానికి వైసీపీ ఎంపీలు ఆసక్తి చూపిస్తున్నారు కానీ..స్పీకర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారో మాత్రం తెలుసుకుని .. ఆమె డౌట్లను క్లారిఫై చేయడానికి ప్రయత్నించడం లేదు.
సుదీర్ఘ కాలం స్పీకర్‌గా పని చేసిన అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు.. రీకన్ఫర్మేషన్ లేఖలు అడిగారంటే… రాజీనామా లేఖలు ఫార్మాట్‌లో లేవనే అర్థమని విశ్లేషించారు. రాజీనామాలు పెండింగ్‌లో పెట్టాలనే ఉద్దేశంతో ఎంపీలు ఫార్మాట్‌లో రాజీనామాలు చేయలేదన్నారు. కానీ వైసీపీ ఎంపీలు మాత్రం తాము అన్ని నిబంధనల ప్రకారం చేశామంటున్నారు. అలాంటప్పుడు రీ కన్ఫర్మేషన్ ఎందుకన్నది కూడా ఓ ప్రశ్న. నిజానికి సాక్షి మీడియా ఇప్పటికే రాజీనామాలు ఆమోదం పొందేశాయి.. చారిత్రాత్మక అడుగును మా ఎంపీలు వేసేశారని కథలు..కథలుగా చెప్పుకుంది. ఇప్పుడు రాజీనామాలు ఆమోదం పొందకపోతే… ఉన్న పరువు కూడా పోతుంది.

ఈ రోజు మధ్యాహ్నంలోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని… లోక్‌సభ సెక్రటేరియట్.. వైసీపీ ఎంపీలకు సమాచారం ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇది మామూలు ప్రచారమో..లేకపోతే నిజంగానే చెప్పారో కానీ.. స్పీకర్.. రాజీనామాలు ఆమోదించకుండా.. వెళ్లారంటే…మాత్రం.. వైసీపీ ఎంపీలు తల ఎక్కడైనా పెట్టుకుని సొంతూళ్లకు వెళ్లాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close