ప్ర‌జ‌లంటే నాయ‌కుల‌పై ఆధార‌ప‌డి బ‌తికేవాళ్లా..?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర 13వ రోజుకి చేరుకుంది. మొద‌టి రోజు నుంచే హామీల వ‌ర్షం కురిపిస్తూ వ‌స్తున్నారు. ‘మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే’ అంటూ మొద‌లుపెట్టి ఏమేం చేయ‌బోతున్నారో చెబుతున్నారు. పిల్ల‌ల్ని బ‌డికి పంపిస్తే డ‌బ్బులిస్తారు. ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ తోపాటు ఇత‌ర ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులిస్తారు. పెన్ష‌న్ వ‌య‌సును 45 ఏళ్ల‌కు త‌గ్గిస్తారు. అవ్వా తాత‌ల‌కు రూ. 2000 పెన్ష‌న్ ఇస్తారు. ఒక‌వేళ ఈలోగా సీఎం చంద్ర‌బాబు నాయుడు పెన్ష‌న్ ను రూ. 2000కు పెంచితే, జ‌గ‌న్ వ‌చ్చాక రూ. 3000 చేస్తారు. వైద్యానికి డ‌బ్బులిస్తారు. చికిత్స త‌రువాత ఆసుప‌త్రిలో విశ్రాంతి తీసుకున్న రోజులకు కూడా డ‌బ్బులిస్తారు. అన్నిటికీ డ‌బ్బూ డ‌బ్బూ డ‌బ్బూ… దేనికైనా స‌రే డ‌బ్బే!

ప్ర‌తిప‌క్ష నేత‌ను ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శించాల‌న్న‌ది ఉద్దేశం కాదుగానీ… ఆయ‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా ఇస్తున్న హామీలూ చేస్తున్న వాగ్దానాలు ప్ర‌తీరోజూ వింటుంటే కొంత ఆవేద‌న క‌లుగుతోంది. నాయ‌కుల దృష్టిలో ప్ర‌జ‌లు అంటే మ‌రీ ఇంత ‘ఇదా’ అనే ఆవేద‌న క‌లుగుతోంది! మ‌న‌ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఎద‌గ‌నివ్వ‌రా..? క‌నీసం ఆత్మాభిమానంతో బ‌తికే పాల‌న‌ను కూడా అందివ్వ‌రా అనే ఆందోళన పెరుగుతోంది. పేద వృద్ధుల‌కు పెన్ష‌న్లు ఇవ్వండి.. త‌ప్పులేదు. కానీ, ఆ వ‌య‌సును 45 కుదించేస్తే… ఏమ‌ని చెబుతున్న‌ట్టు! ఆ వ‌య‌సు దాటాక ప‌ని చెయ్యొద్ద‌నా.. ఆ వ‌య‌సు దాటిన‌వారు ప‌నుల‌కు ప‌నికిరార‌నా..? 45 ఏళ్ల‌కే వృద్ధాప్యాన్ని అంట‌గ‌ట్టేస్తారా..? ఇక‌, పెన్ష‌న్ విష‌యానికొస్తే.. చంద్ర‌బాబు రూ. 2 వేలు చేస్తే… ఈయ‌న రూ. 3 వేలు చేస్తార‌ట‌. స‌రే. ఒక‌వేళ చంద్ర‌బాబు రూ. 2 వేలు చేయ‌కుంటే… ఈయ‌నా రూ. 3 వేల వ‌ర‌కూ పెంచ‌ర‌నే కదా అర్థం. ఈ క్ర‌మంలో ఒక వృద్ధుడి అవ‌స‌రాలు అనే యాంగిల్ ఎక్క‌డుంది..? వ‌య‌సు మ‌ళ్లిన వారిపై నాయ‌కుల ప్రేమ ఇంతేనా..? వారి అధికార దాహం కోసం ముస‌లాళ్ల‌కు డ‌బ్బులు ఇస్తున్న‌ట్టుగా ఉంది. ఈ ఇస్తున్న విధానానికి ‘పెన్ష‌న్’ అని పేరు పెడుతున్న‌ట్టుంది.

ఇవే కాదు.. ఇత‌ర హామీలు ఏవి త‌ర‌చి చూసినా.. అంతిమంగా క‌నిపిస్తున్న‌ది ఒక్క‌టే… పార్టీలు విసిరే ఇలాంటి ‘సంక్షేమ ప‌థ‌కాలు’ అన‌బ‌డే ఈ ‘డ‌బ్బు’ రూపేణా అందే సాయం కోసం ప్ర‌జ‌లు ఎదురు చూడాలి. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డం అంటే డ‌బ్బు రూపంలో మాత్ర‌మేనా..? ప్ర‌భుత్వాల నుంచి, లేదా ఈ నాయ‌కుల నుంచి ప్ర‌జ‌లు ఆశిస్తున్న‌ది కేవ‌లం డ‌బ్బేనా..? పేద‌రికాన్ని వ‌దిలించుకోవాల‌నే క‌సిని రేకెత్తేలా, అర్హులకు ఉపాధి అవకాశాలు చూపిస్తూ పేద‌వాడి ఆలోచ‌నా విధానాన్ని ప్రేరేపించే పాల‌న ఇవ్వ‌లేరా..? ఉద్యోగం రాలేద‌న్న నైరాశ్యంలో ఉన్న‌వాడికి, నైపుణ్యాల లోపాల‌ను గుర్తించి, వాటిని పెంచుకుని విజ‌యం సాధించే దిశ‌గా న‌డిపించే స్ఫూర్తిమంత‌మైన పాల‌న ఇవ్వ‌లేరా..? ఒక వ్యక్తి త‌న‌లోని శ‌క్తిని తానే గుర్తించి, దాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు, దాన్నే బ‌తుకుబాటుగా మార్చుకునేందుకు కావాల్సిన వాతావ‌ర‌ణాన్ని సృష్టించే పాల‌న ఇవ్వ‌లేరా..? మనుషుల్లో ఓటర్లను చూసే నాయకులు ఉన్నంతకాలం.. పాలన అంటే వారు విదిల్చే సాయమనో, వారి ఉదారతకు నిదర్శనమో అన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close