పాల‌క మండ‌ళ్ల ర‌ద్దు ఆలోచ‌న‌లో జ‌గ‌న్ స‌ర్కారు!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంతో స‌హా రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న పాల‌క మండ‌ళ్ల‌ను ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు స‌మాచారం. తొలి కేబినెట్ స‌మావేశంలో దీనికి సంబంధించిన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే, ర‌ద్దు చేయాల‌నుకుంటే ముంద‌స్తుగా నోటీసులు ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఒక‌వేళ అలా నోటీసులు ఇయ్యాల్సి వ‌స్తే కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ స‌ర్కారు ఉంద‌ని తెలుస్తోంది. ఈనెల 8వ తేదీన మంత్రి వ‌ర్గం ఏర్పాటు ఉంటుంద‌ని తెలిసిందే. అదే రోజున కేబినెట్ భేటీ పెట్టి, వెంట‌నే పాల‌క మండ‌ళ్ల ర‌ద్దుపై ఆమోదింప‌జేయాల‌ని భావిస్తున్నారు. ఆ తీర్మానాన్ని వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ కు పంపించాల‌నే ప్ర‌య‌త్నంలో ప్ర‌భుత్వం ఉంద‌ని స‌మాచారం.

ఒక‌వేళ‌, కేబినెట్ లో దీనిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యం లేక‌పోతే… ఈనెల 12 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. తొలి స‌మావేశాల్లోనే ఈ అంశాన్ని స‌భ ఆమోదంతోనైనా ముందుకు తీసుకెళ్లాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టుగా వినిపిస్తోంది. అసెంబ్లీలో స‌వ‌ర‌ణ బిల్లు పెట్టాల్సి ఉంటుంది. దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ‌కు సంబంధించిన చ‌ట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

నిజానికి, ప్ర‌భుత్వం మారిన వెంట‌నే… ఆల‌యాల పాల‌క‌మండ‌ళ్ల‌లో మార్పులు అనేది స‌హ‌జమే. ఇప్ప‌టికే తితిదే పాల‌క మండ‌ల‌కి సంబంధించిన స‌భ్యులు కొంత‌మంది రాజీనామాలు చేశారు. ప్ర‌స్తుతం తీసుకున్న నిర్ణ‌యం ద్వారా వైకాపాకి చెందిన కొంత‌మంది నాయ‌కుల‌తో కొంత పాల‌క మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంటుంది. నిజానికి, నోటీసులు ఇచ్చి ర‌ద్దు చేయాల్సి ఉన్నా…. ఒక‌వేళ ఏదైనా ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం కోర్టులో దాఖ‌లైతే… పాల‌క మండ‌ళ్ల అంశం కోర్టు ప‌రిధిలోకి వెళ్లిపోతుంది. కోర్టు ఏదో ఒక‌టి తేల్చే వ‌ర‌కూ కొత్త నియామ‌కాల్లాంటివి సాధ్యం కాదు క‌దా. అందుకే, ఆర్డినెన్స్ తేవాల‌నేది జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close