సీఆర్డీఏను రద్దు చేసే దిశగా జగన్..!?

రాజధాని రైతుల ఆందోళన ప్రభుత్వానికి నచ్చడం లేదు. అందుకే.. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలనుకుంటున్నారు. అదే సీఆర్డీఏ చట్టం రద్దు. రాజధాని పరిధి అభివృద్ధి కోసం.. సీఆర్డీఏను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారమే.. రైతులతో.. ఒప్పందాలు చేసుకున్నారు. అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ చట్టంలో ఉన్న అనేక హామీలకు రైతులకు భరోసా ఇస్తున్నాయి. కోర్టుల్లో పిటిషన్లు వేసిన రైతులు కూడా.. ఈ చట్టంలోని అంశాలనే ప్రధానంగా చూపిస్తున్నారు. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ చట్టాన్ని రద్దు చేస్తే ఎలా ఉంటుందా.. అని న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభమయిందంటున్నారు.

సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడం అంత తేలిక కాదన్న చర్చ.. కూడా అధికారవర్గాల్లో నడుస్తోంది. కొన్ని వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి సీఆర్డీఏ సమీకరించింది. ఇలాంటి సమయంలో.. ఆ చట్టాన్ని రద్దు చేయాలంటే.. ఆ చట్టం ద్వారా చేసిన పనులు.. చేపట్టిన కార్యకలాపాలకు సంబంధించి.. బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా.. ఏకపక్షంగా చట్టం రద్దు చేస్తే.. అది కోర్టుల్లో నిలబడదు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అయితే.. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా.. చట్టబద్ధంగా.. సీఆర్డీఏ చట్టాన్ని ఎలా రద్దు చేయాలన్నదానిపై.. ఇప్పుడు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారు.. కసరత్తు చేస్తున్నారు.

సీఆర్డీఏ .. అనేక అంతర్జాతీయ సంస్థలోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. రైతుల వద్ద భూములు తీసుకోవడం మాత్రమే కాదు..  అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ప్రజలు, ఎన్నారైల వద్ద… డబ్బులు వసూలు చేసింది. హ్యాపీనెస్ట్ పేరుతో ప్రాజెక్ట్ కూడా.. ప్రారంభించారు. అయితే అది పునాదుల దశలోనే ఉంది. ఇప్పుడు.. సీఆర్డీఏను రద్దు చేయాలంటే.. ప్రభుత్వం వారికి భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పైగా.. సీఆర్డీఏ చేసుకున్న అభివృద్ధి ఒప్పందాలన్నింటీలోనూ.. అమరావతిని రాజధానిగా పేర్కొన్నారు. ఇప్పుడు రాజధానిగా లేకపోతే.. ఒప్పందాలు చేసుకున్న ప్రతి ఒక్కరు.. రైతులతో సహా… కోర్టుకెళ్లేందుకు హక్కులు ఉన్నాయి.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close