జగన్ మాట తీరులో మార్పుపై వైకాపాలో చర్చ!

వైకాపాతో కొంత స‌న్నిహితంగా ఉన్న‌వారికి ఈ మాట గుర్తుండే ఉంటుంది! 2014 ఎన్నికల్లో జ‌గ‌న్ గెలుపు త‌థ్య‌మ‌ని మొద‌ట్నుంచీ వైకాపా వ‌ర్గాలు చాలా ధీమాతో ఉన్నాయి. కానీ, వైకాపా ఓడిపోయింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజున‌… జ‌గ‌న్ ను ప‌ల‌క‌రించేందుకు నేతలు, అభిమానులు చాలామంది వెళ్లారు. వారిలో కొంత‌మందితో జ‌గ‌న్ చెప్పిన మాటేంటంటే… ‘మ‌రో ఐదేళ్లే క‌దా, పోరాటం చేద్దాం, అధికారం వ‌స్తుంది’ అని! అక్క‌డి జగన్ చేసిందీ అదే.. ఐదేళ్లపాటు ఎదురుచూడ్డం. ఈ క్ర‌మంలో గడచిన ఐదేళ్లుగా ప్ర‌తిప‌క్ష నేతగా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఏం చేశారు అనేది వేరే చ‌ర్చ‌! అయితే, అప్ప‌ట్నుంచీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నిక‌లు – అధికారం ఫోక‌స్ గానే జ‌గ‌న్ రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి కావ‌డం ల‌క్ష్యంగానే మాట్లాడుతూ ఉండేవారు. చివ‌రికి, బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా… ‘మ‌నం అధికారంలోకి వ‌చ్చేస్తున్నాం’ అనేట్టుగానే మాట్లాడ‌తారు. ఈ తీరుపై వైకాపాలో మొద‌ట్నుంచీ కొంత చ‌ర్చ ఉంది.

ముఖ్యమంత్రి కావడమే తన కల అంటూ ఈ మ‌ధ్య ఇండియా టుడే కాంక్లేవ్ లో కూడా జ‌గ‌న్ చెప్పారు. అంతేకాదు, ఒక‌సారి అధికారం వస్తే మూడు ద‌శాబ్దాలు ప‌రిపాలించాల‌నే సంకల్పం త‌న‌కి ఉందనీ మాట్లాడారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి గురించి జ‌గ‌న్ ఇలా ప‌దేప‌దే మాట్లాడ‌కుండా ఉంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయం పార్టీలో కొంత‌మందిలో ఉంది. ఎప్పుడూ పదవి గురించే మాట్లాడుతుంటే… ప్ర‌జ‌ల్లోకి వెళ్లే సంకేతాలు వేరుగా ఉంటాయ‌నే అభిప్రాయం కొంత‌మందిలో ఉంది. అయితే, ఆ మాట‌ను నేరుగా జ‌గ‌న్ ముందుకు తీసుకెళ్ల‌గ‌లిగే ప‌రిస్థితి వైకాపాలో ఉంటుందా..?

ఇక‌, ప్ర‌స్తుత విష‌యానికొస్తే… నిన్న‌, కాకినాడ‌లో జ‌రిగిన స‌మ‌ర శంఖారావ స‌భ‌లో మొట్ట మొద‌టిసారిగా… ‘నాకో అవ‌కాశం ఇవ్వండి’ అంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు. ఇంత‌కుముందు ఎప్పుడూ ఇలా ‘ఒక అవ‌కాశం’ అని ఆయ‌న మాట్లాడింది లేదు. మొద‌ట్నుంచీ జ‌గ‌న్ ఇలానే మాట్లాడి ఉంటే బాగుండేదనే చ‌ర్చ వైకాపా వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తోంది. త‌న‌ని ముఖ్య‌మంత్రిని చెయ్యండ‌ని కోరే కంటే, త‌న‌కో అవ‌కాశం ఇవ్వండి అని కోర‌డం ద్వారా ప్ర‌జ‌ల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ‌తాయ‌ని వైకాపా కార్య‌క‌ర్త‌ల్లో కూడా కొంత చ‌ర్చ జ‌రుగుతున్నట్టు స‌మాచారం. అయితే, వాస్త‌వం ఏంటంటే… ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైపోయింది! ముఖ్య‌మంత్రి కావ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్యం అనేది ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుంది. పైగా, ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ్డాక ‘ఒక్క అవ‌కాశం ఇవ్వండి’ అంటూ కోర‌డాన్ని మ‌రోలా విశ్లేషిస్తున్న‌వారూ ఉన్నారు. జ‌గ‌న్ ఆత్మ‌విశ్వాసంలో తేడా క‌నిపిస్తోంద‌ని అనేవారూ లేక‌పోలేదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల...

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close