మోదీకి కూడా సురేష్ ప్రభు లేఖ..! వెనుక ఎవరున్నారు..!?

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని విచ్చలవిడిగా ఓటు బ్యాంకుకు పథకాల పేరుతో పంపిణీ చేస్తున్న వైనంపై.. కేంద్రమాజీ మంత్రి సురేష్ ప్రభు తాజాగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఒక్క రోజు ముందే నిర్మలా సీతారామన్‌కు.. పీయూష్ గోయల్‌కు కూడా లేఖలు రాసిన ఆయన.. తాజాగా ప్రధానమంత్రి మోడీకి కూడా రాశారు. పట్టు వదలకుండా.. సురేష్ ప్రభు ఇలా వరుసగా లేఖలు రాయడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. నిజానికి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ఎంపీనే. అయితే.. ఆంధ్రప్రదేస్ ప్రయోజనాల కోసం కానీ.. ఏపీ విషయాల్లో కానీ ఆయన ఎక్కడా పెద్దగా మాట్లాడినట్లుగా రికార్డు కాలేదు. టీడీపీ హయాంలో.. బీజేపీతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఓ రాజ్యసభ సీటును టీడీపీ ఇచ్చింది.

అది అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుకు బీజేపీ కేటాయించింది. దాంతో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నారు. అంతకు మించి.. ఏపీకి ప్రత్యేకంగా ఆయన కంట్రిబ్యూట్ చేసిందేమీ లేదు. హఠాత్తుగా.. ఏపీ ఆర్థిక పరిస్థితి.. అప్పులు తీసుకుంటున్న వైనం.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు వంటి వాటిపై ఆయన స్పందించడం ప్రారంభించారు. నిజానికి ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయం. రెవిన్యూ లోటు ఒక్క ఏడాదిలో అరవై వేల కోట్లకు చేరిందంటే.. అది మామూలు విషయం కాదు. కొలాప్స్ అవడానికి చివరి మెట్టు మీదే ఉన్నట్లే లెక్క.

అయితే ప్రభుత్వం వినూత్న మార్గాల ద్వారా అప్పుల సేకరణ జరిపి.. బండి నెట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో.. ఏపీకి అప్పులు కూడా దొరకూడదన్నట్లుగా సురేష్ ప్రభు లేఖలు రాయడం మాత్రం.. ఆసక్తికరంగా మారింది. ఆయనతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అలా రాయిస్తున్నారా లేకపోతే.. ఆయనే ఈ లేఖలు.. ఏపీ ఆర్థిక పరిస్థితిని చూసి కంగారు పడి రాస్తున్నారా.. అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. సురేష్ ప్రభును మోడీ కూడా ఓ ఇంటెలెక్చువల్‌గా చూస్తారు. ఆయన లేఖకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు.. కేంద్రం వైపు నుంచి ఏపీకి అప్పులు రాకుండా.. ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం.. సురేష్ ప్రభు ఈ విషయంలో సక్సెస్ అయినట్లే. ఏపీ సర్కార్ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close