హైదరాబాద్‌ను వదులుకున్నందుకు రూ.1400 కోట్లేనా..!?

కేంద్ర బడ్జెట్‌తో పాటు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఈ సారి కొత్తగా కనిపించి హైలెట్ అయిన అంశం… హైదరాబాద్‌ను కోల్పోయినందుకు ఏపీకి రూ. 1400కోట్లు అదనంగా కేటాయించడం. హైదరాబాద్‌లా విశాఖను అభివృద్ధి చేయడానికి వివిధ కార్యక్రమాల కింద రూ. 1400 కోట్లు కేటాయించాలని ఏపీ సర్కార్ కోరడం.. దానికి ఆర్థిక సంఘం ఆమోదించడం జరిగిపోయాయి. అంటే… ఐదేళ్ల కాలంలో విశాఖకు రూ.1400 కోట్లు వస్తాయి. ఎందుకు అంటే.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడం. నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చుకోవలాంటే రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి నిధులు కావాలని కోరింది. హైదరాబాద్‌లాంటి నగరాన్ని వదులుకున్నందుకు రూ. 1400 కోట్లే కదా కోరుతుంది అని ఆర్థిక సంఘం కూడా ఐదేళ్లలో ఇవ్వాలని సిఫార్సు చేసింది. అంటే ఏడాదికి మూడు వందల కోట్లు కూడా వచ్చే అవకాశం లేదు.

కొత్త ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ఎంచుకుంది. అదే విషయాన్ని ఆర్థిక సంఘానికి చెప్పి.. అత్యదిక నిధులు ఆ నగారానికి మంజూరుయ్యేలా సిఫార్సులు చేసింది. ప్రభుత్వాలు చేసే సిఫార్సులన్నీ కాకపోయినా… వాటి సైజును బట్టి కొన్నింటినీ ఆర్థిక సంఘం ఆమోదిస్తుంది. కొన్నింటిని ఖచ్చితంగా ఆమోదించాలనిరాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుంది. అలా పట్టుబట్టి మరీ… విశాఖకు నిధులు కేటాయింప చేసేలా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు హైదరాబాద్‌ను కోల్పోయినందుకు అనే మాటను ఆర్థిక సంఘం ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటనేది ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ప్రశ్న.

పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అక్కడి ఆస్తులపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉంటుంది. పదేళ్ల తర్వాత ఉమ్మడి ఆస్తుల్లో సగం ఏపీకి దక్కాల్సి ఉందని అంటున్నారు. ఏపీకి కేటాయించినవి ఏపీ ఆస్తులుగానేభావించాల్సి ఉంటుందన్న చర్చ కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌పై పూర్తి స్థాయిలో హక్కులు వదిలేసుకున్నట్లుగా ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ వ్యవహారంపై అసలు అంతర్గత విషయాలు వెలుగులోకి వస్తే కానీ.. అసలేం జరిగిందో… హైదరాబాద్ కోల్పోయినందుకు పరిహారంగా రూ. 1400 కోట్లు ఇచ్చిందా లేక ఇంకేదైనా కారణంతో ఆ పేరు పెట్టి సిఫార్సు చేశారా అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close